పూరితో బాలయ్య సినిమా ఉంటుందా ?

పూరితో బాలయ్య సినిమా ఉంటుందా ?

Published on May 24, 2018 9:42 AM IST

‘ఎన్టీఆర్’ బయోపిక్ ఆగిపోవడంతో నందమూరి బాలక్రిష్ణ వరుస సినిమాలకు సైన్ చేసే పనిలో ఉన్నారు. పలువురు స్టార్ డైరెక్టర్లు సైతం బాలక్రిష్ణతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే వినాయక్ తో ఒక చిత్రాన్ని కన్ఫర్మ్ చేసుకున్న బాలయ్య తన లక్కీ డైరెక్టర్ బోయపాటితో కూడ సినిమా చేసే యోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రాలు మొదలవుతాయట.

ఈ రెండు కాకుండా పూరి జగన్నాథ్ కూడ బాలక్రిష్ణతో సినిమా చేయాలని అనుకుంటున్నారని, ఇప్పటికే స్క్రిప్ట్ కూడ వినిపించారని, అయితే బాలక్రిష్ణ ఇంకా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఫిల్మ్ నగర్ టాక్. మరి వరుసగా పెద్ద దర్శకులతో సినిమాలకు ఓకే చెప్తున్న బాలయ్య పూరికి ఎలాంటి జవాబిస్తారో చూడాలి. గతంలో పూరి, బాలక్రిష్ణల కలయికలో ‘పైసా వసూల్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు