మూవీ చరిత్రలోనే ‘ఆగడు’ కోసం బిగ్గెస్ట్ హోర్డింగ్.!

మూవీ చరిత్రలోనే ‘ఆగడు’ కోసం బిగ్గెస్ట్ హోర్డింగ్.!

Published on Sep 18, 2014 4:53 PM IST

aagadu-hoarding

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఒక సినిమాని తీయడానికి సినిమా టీం అంతా ఎంత కష్టపడతారో దానికన్నా ఎక్కువగా ఆ సినిమాని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం కష్టపడాలి. అందుకే సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ కి లోపు సినిమా ప్రమోషన్స్ అనేవి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే రేపు రిలీజ్ కానున్న మహేష్ బాబు ‘ఆగడు’ కోసం భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఆగడు ప్రమోషన్స్ లో భాగంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు మూవీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అత్యంత భారీ హోర్డింగ్ ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసారు. దీన్ని ఈ హోర్డింగ్ పొడవు 1060 అడుగులు పొడవు ఉంది. ఈ రేంజ్ హోర్డింగ్ మన మన తెలుగు సినిమాకి పెట్టడం ఇదే ప్రధమం. సికింద్రాబాద్ ప్రాంతం ఎప్పుడూ జనసందోహంతో బిజీగా ఉంటుంది. అక్కడ తిరుగుతున్న జనసందోహాన్ని ఈ హోర్డింగ్ మాగా ఆకర్షిస్తోంది.

మహేష్ బాబు – తమన్నా జంటగా నటిస్తున్న ఈ మూవీకి శ్రీను వైట్ల డైరెక్టర్. శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు