‘ది..చూ..రామయ్య’ కోసం సాయి కొర్రపాటి కోటి రూపాయల సెట్

‘ది..చూ..రామయ్య’ కోసం సాయి కొర్రపాటి కోటి రూపాయల సెట్

Published on Aug 22, 2014 5:35 PM IST

dikkulu_choodaku_ramayya
‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసిన సాయి కొర్రపాటి మరోసారి యువ టాలెంట్ తో తన వారాహి చలన చిత్రం బానర్ పై నిర్మిస్తున్న సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. అజయ్, ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం నాగ సౌర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సన హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ సినిమా ద్వారా ఎస్ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన త్రికోఠి దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

చిన్న సినిమా అయినా సరే క్వాలిటీలో ఎక్కడా రాజీపడకుండా, ఎంత దూరం అయిన వెళ్ళే సాయి కొర్రపాటి ‘దిక్కులు చూడకు రామయ్య’ విషయంలో కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ఈ సినిమాకి కీలకం అయిన ఓ పాట కోసం కోటి రూపాయలు పెట్టి రామానాయుడు స్టూడియోస్ లో ఓ ప్రత్యేక సెట్ ని రూపొందించారు. రాజు సుందరం మాస్టర్ నేతృత్వంలో ఈ మూవీ లోని ప్రధాన తారాగణంపై ప్రస్తుతం ఈ పాటని షూట్ చేస్తున్నారు.

ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. కీరవాణి అందించిన అద్భుతమైన పాటల ఫీల్ ని ఎక్కడా పోగొట్టకూడదనే ఉద్దేశంతో ఈ చిత్ర టీం ఈ రేంజ్ లో ఖర్చు పెట్టి పాటలను షూట్ చేస్తున్నారని సమాచారం. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉన్న పోస్ట్ పొడక్షన్ కార్యక్రమాలు త్వరలో మొదలు కానున్నాయి. అక్టోబర్ 1న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అజయ్, నిన్నటి తరం హీరోయిన్ ఇంద్రజ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు