‘అల్లుడు శీను’కి ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్

‘అల్లుడు శీను’కి ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్

Published on Jul 24, 2014 5:00 PM IST

alludu-srinu

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘అల్లుడు శీను’. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బెల్లంకొండ సురేష్ ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు నిన్న రాత్రి ఓ స్పెషల్ షో వేసారు. ఈ స్పెషల్ షో చూసిన వారందరూ సినిమా బాగుందని అంటున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో పాటు ఆద్యంతం కామెడీ ఉండేలా చూసుకోవడం ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని అంటున్నారు. అలాగే డింపుల్ గా బ్రహ్మానందం పాత్ర బాగా నవ్విస్తుందని అంటున్నారు.

సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ తీసుకున్న ఈ సినిమా నిడివి 2 గంటల 31 నిమిషాలు. ప్రకాష్ రాజ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. బెల్లంకొండ సురేష్ తన కొడుకు సినిమా కావడం వల్ల అన్ని డిపార్ట్ మెంట్స్ లోనూ బెస్ట్ ఉన్నవారిని తీసుకొని భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కి విజయాన్ని అందించిందా? లేదా? అనేది మరి కొద్ది గంటల్లో తెలిసిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు