‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్

‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్

Published on Aug 16, 2026 9:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషనల్ థ్రిల్లర్ పై సాలిడ్ హైప్ ఇప్పుడు నెలకొంది. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాల్లో చార్ట్ బస్టర్ సాంగ్ మల్లెపూల పల్లకి సాంగ్ పట్ల నెలకొన్న ఆసక్తి కూడా చాలా ఉంది.

సినిమా స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ ఉందని వచ్చిన టాక్ సినిమాపై మరింత అంచనాలు తీసుకొచ్చేలా చేసింది. ఇక ఫైనల్ గా ఈ సాంగ్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి నేడు మేకర్స్ ఈ పాటని విడుదల చేసేసారు. ఒరిజినల్ సాంగ్ ని ఆలపించిన డప్పు శ్రీనుతోనే పాడించి తనదైన ట్యూనింగ్ తో జీవి ప్రకాష్ సాలిడ్ చార్ట్ బస్టర్ ని అందించారు అని చెప్పవచ్చు.

ఇక ఈ సాంగ్ లో మాస్ మహారాజ రవితేజ ఎనర్జీ అదనపు ఆకర్షణ అని చెప్పాల్సిందే. ఇలా మొత్తానికి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సాంగ్ వచ్చి అనుకున్నట్టే ఫ్యాన్స్ ని ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా తెలుగు, తమిళ్ లో ఈ ఆగష్టు 21న విడుదల కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు