బాలకృష్ణ 99వ చిత్రంలో నాయికగా అంజలి

బాలకృష్ణ 99వ చిత్రంలో నాయికగా అంజలి

Published on May 23, 2015 6:13 PM IST

anjali
శ్రీవాస్ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించనున్న సినిమాకు ‘డిక్టేటర్’ అన్న నామకరణం చేశారు. బాలయ్యబాబు 99వ చిత్రం కావడంతో ఈ సినిమా లాంచ్ కు ముందే అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరున ఈ చిత్రం ప్రారంభంకానుంది.

ఈ సినిమాలో నాయిక పాత్రకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మనింటి అమ్మాయిగా మారిపోయిన అంజలి నటించనుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. థమన్ సంగీతాన్ని అందించనున్నారు. కోనా వెంకట్, గోపీ మోహన్ తదితరులు స్క్రిప్ట్ వ్యవహారాలు చూసుకోనున్నారు. ఈ చిత్రంకోసం బాలీవుడ్ టెక్నీషియన్లను ఎంపిక చేసిన విషయం తెలిసినదే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు