మహేష్ బాబు కోసం మరో స్టంట్ మాస్టర్ !

మహేష్ బాబు కోసం మరో స్టంట్ మాస్టర్ !

Published on Oct 27, 2016 3:05 PM IST

mrug
సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్నాడు. క్రైమ్ తరహా నైపథ్యంలో నడిచే కథ కాబట్టి సాధారణంగానే ఫైటింగ్ సీక్వెన్స్ లు, యాక్షన్ ఎపిసోడ్ లు ఎక్కువగానే ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షన్ పాటించే డైరెక్టర్ మురుగదాస్ ఈ యాక్షన్ సీక్వెన్స్ లపై ఎక్కువ దృష్టి పెట్టాడు. కొత్త తరహా పోరాట సన్నివేశాల్ని రూపొందించాలని అనుకుంటున్నాడు.

అందుకే ఇప్పటికే అనల్ అరసు, పీటర్ హెయిన్స్ మహేష్ కోసం యాక్షన్ ఎపిసోడ్స్ ని కంపోజ్ చేస్తుండగా మరో ఫెమస్ స్టంట్ మాస్టర్ రవి వర్మని తీసుకొచ్చాడు మురుగదాస్. రవి వర్మ గతంలో ‘జైహో, రాజ్ కుమార్, అఖిల్ వంటి సినిమాలకి యాక్షన్ సీక్వెన్స్ లను డైరెక్ట్ చేసి ప్రస్తుతం రామ్ చరణ్ ‘ధృవ’ కి కూడా పనిచేస్తున్నాడు. ఇలా ముగ్గురు ఫెమస్ స్టంట్ మాస్టర్ల సారథ్యంలో రూపొందబోయే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఇకపోతే మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2017 లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు