ఫుడ్ పాయిజన్ తో ఇబ్బందిపడ్డ బాలకృష్ణ !
Published on Jul 4, 2017 9:16 am IST


నందమూరి బాలకృష్ణ ఫుడ్ పాయిజన్ తో ఇబ్బందిపడ్డారు. నిన్న సాయంత్రం జరిగిన ‘శమంతకమణి’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిధిగా రావాల్సి ఉంది. అక్కడి నిర్వాహకులు అందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ చివరి క్షణంలో బాలయ్య ఆ వేడుకకు హాజరుకాలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ కాస్తంత నిరుత్సాహానికి గురయ్యారు.

అభిమానుల్లోనే ఆ నిరుత్సాహాన్ని గమనించిన చిత్ర కథానాయకుల్లో ఒకరైన నారా రోహిత్ బాలకృష్ణ వేడుకకు రాకపోవడానికి గల కారణం బయటపెట్టారు. అదేమిటంటే నిన్న సాయంత్రం ఫుడ్ పాయిజన్ కావడం వలన ఆయన రాలేకపోయారని, ఈ విషయాన్ని అందరికీ తెలియజేయమన్నారని అన్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో ‘పైసా వసూల్’ చిత్రం చేస్తున్న బాలకృష్ణ ఆగష్టు నెల నుండి కె.ఎస్. రవికుమార్ యొక్క చిత్రాన్ని సైతం మొదలుపెట్టనున్నారు.

 
Like us on Facebook