రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయనున్న శ్రీవాస్.?

రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయనున్న శ్రీవాస్.?

Published on Oct 19, 2014 9:55 PM IST

ramcharan-srivas
‘లక్ష్యం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ శ్రీవాస్ తన చివరి సినిమా ‘లౌక్యం’తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీ వాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు. అసలు విషయంలోకి వెళితే ఇప్పటికే కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి చెప్పిన కథకి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని ఇది వరకే తెలియజేశాం.

ఇదే సినిమా కోసం డైరెక్టర్ కోసం కొద్ది రోజులుగా అన్వేషణ జరుగుతోంది. కోన వెంకట్ – గోపి మోహన్ ల కథని డైరెక్ట్ చేసే అవకాసహం శ్రీవాస్ ని వరించినట్లు సమాచారం. శ్రీవాస్ కి కోన వెంకట్ – గోపి మోహన్ లతో మంచి రిలేషన్ ఉంది. శ్రీవాస్ డైరెక్ట్ చేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘లౌక్యం’ సినిమాలకి వీరు పనిచేసారు. దాంతో వీరి రిలేషన్ షిప్ మరింత పెరిగింది. దాంతో కోన వెంకట్ – గోపి మోహన్ ల కథకి శ్రీ వాస్ న్యాయం చేయగలడని ఆశిస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే శ్రీ వాస్ కి రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు