చిట్ చాట్ : భవాని అగర్వాల్ – ‘ఫాం హౌస్’ మూవీ హీరోయిన్ కం ప్రొడ్యూసర్.

చిట్ చాట్ : భవాని అగర్వాల్ – ‘ఫాం హౌస్’ మూవీ హీరోయిన్ కం ప్రొడ్యూసర్.

Published on Oct 9, 2014 7:00 PM IST

Bhavani
నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలోను విజయం సాదిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో నేను నిర్మాతగా, హీరోయిన్ గా విజయం సాదిస్తాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు భవాని అగర్వాల్. చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ తెలుగమ్మాయి ‘ఫాం హౌస్’ సినిమాతో నిర్మాతగా మారారు. ఎం.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భవాని అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా విశేషాలను తెలుసుకోవడానికి ఆమెతో కాసేపు ముచ్చటించాం. ఆ చిట్ చాట్ వివరాలు మీకోసం..

ప్రశ్న) మీ నేపధ్యం గురించి చెప్పండి..?

స) మా స్వస్థలం వరంగల్. హైదరాబాద్ లో స్థిరపడ్డాం. నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, అమ్మ గృహిణి. మొదట నుండి నటన అంటే బాగా ఆసక్తి. నా ఇష్టాన్ని గౌరవించి ఇంట్లో కూడా ప్రోత్సహించారు. చదువు పూర్తయిన తర్వాత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాను.

ప్రశ్న) ఇప్పటివరకు ఏఏ సినిమాలో నటించారు..?

స) మనోజ్ నందం హీరోగా నటించిన ‘నిన్ను చూసాక’, ‘బాయ్ ఫ్రెండ్’, ‘దక్షిణ మధ్య రైల్వే జట్టు’ సినిమాలలో హీరోయిన్ గా నటించాను. ‘ఫాం హౌస్’ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు స్వయంగా నిర్మించాను.

ప్రశ్న) ‘ఫాం హౌస్’ సినిమాతో నిర్మాతగా మారడానికి గల కారణం..?

స) దర్శకులు ఎం.ఎన్.రెడ్డి గారితో నాకు మొదటి నుండి పరిచయం ఉంది. ఈ కథ విన్న తర్వాత నేనే ఈ సినిమాను ఎందుకు నిర్మించకూడదు అనిపించింది. డిఫరెంట్ కాన్సెప్ట్… ప్రేక్షకులు ఆదరిస్తారు, నాకు మంచి గుర్తింపు వస్తుంది అనిపించడంతో నిర్మాతగా మారాను.

ప్రశ్న) ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి..?

స) ఒక వ్యక్తికి ప్రతి సోమవారం కొన్ని కలలు వస్తాయి. వాటిలో కొన్ని జరుగుతాయి. అందులో రెండు కలలు ‘ఫాం హౌస్’ సినిమా కథ. మన్ డే మిస్టరీ అని కాప్షన్ పెట్టాం. సిక్స్త్ సెన్స్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. ముగ్గురు స్నేహితులు వారి ప్రియురాళ్ళమధ్య జరిగే సరదా సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్. 15 నిముషాలు పాటు సింగిల్ షాట్ లో ఓ సన్నివేశం షూట్ చేశాం. అది సినిమాకి హైలైట్ అవుతుంది.

ప్రశ్న) ఒక మహిళగా సినిమా నిర్మాణం కష్టం అనిపించిందా..?

స) నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలోను విజయం సాదిస్తున్నారు. మా కుటుంబం ముందు నుండి వ్యాపార రంగంలో ఉంది. నిర్మాతగా ఎటువంటి కష్టాలు పడలేదు. ప్లాన్ ప్రకారం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాం. అవుట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ప్రశ్న) సినిమాను ఎప్పుడు విడుదల చేస్తున్నారు..?

స) కథ ప్రకారం సినిమాలో పాటలు పెట్టలేదు. రీ రికార్డింగ్ ఇటివలే పూర్తయింది. అద్బుతంగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదిని ప్రకటిస్తాం.

ప్రశ్న) సినిమాలలోకి రావడానికి, హీరోయిన్ కావడానికి స్ఫూర్తి ఎవరు..?

స) సౌందర్య గారు అంటే నాకు చాలా ఇష్టం. సహజంగా నటిస్తారు. ‘అంతపురం’, ‘అమ్మోరు’ సినిమాలలో ఆమె నటన అద్బుతం. గ్లామర్, స్కిన్ షోలకు నేను దూరం. నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకోవాలని ఆ ఆశ.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?

స) రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తాను. అంతా కొత్తవాళ్ళతో ‘అమ్మో బాపు గారి బొమ్మో’ అనే సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాను. అంటూ చిట్ చాట్ ముగించాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు