హైద్రాబాద్‌లో ‘డిక్టేటర్’ నెక్స్ట్ షెడ్యూల్!

హైద్రాబాద్‌లో ‘డిక్టేటర్’ నెక్స్ట్ షెడ్యూల్!

Published on Sep 19, 2015 1:44 PM IST

dictatoot
‘డిక్టేటర్’.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చేస్తోన్న 99వ సినిమా. అనౌన్స్ అయిన రోజునుంచే అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం ఆసక్తికరంగా మారింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సినిమాలతో మెప్పించిన శ్రీవాస్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈమధ్యే బల్గేరియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్, ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది.

వినాయక చవితి పర్వదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, గణేష పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రెట్టించిన ఉత్సాహంతో డిక్టేటర్ టీమ్ హైద్రాబాద్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. సోమవారం నుండి హైద్రాబాద్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ దాదాపుగా పూర్తవుతుందని తెలుస్తోంది. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఎరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సినిమా నిర్మాణంలో భాగమవుతోంది.

తాజా వార్తలు