మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ మరోసారి జతకట్టిన క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో, ఈ కొత్త సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ ఈసారి మెగాస్టార్‌ను ఏ రేంజ్ మాస్ అవతారంలో చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
ఈ చిత్రానికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 11, 2026న అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం, ఏప్రిల్ 20 నుండి రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా మొదలుకానుంది. దీని కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా బాబీ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రంలోని ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.


