ప్రత్యేక ఇంటర్వ్యూ : క్రాంతి – నా టాలెంట్ గురించి నా పాత్ర మాట్లాడుతుంది.!

ప్రత్యేక ఇంటర్వ్యూ : క్రాంతి – నా టాలెంట్ గురించి నా పాత్ర మాట్లాడుతుంది.!

Published on Jul 3, 2014 3:30 PM IST

Kranthi

వారాంతం వచ్చిందంటే కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘ఆ ఐదుగురు’ ఒకటి. ఈ సినిమాలో ఒక హీరోగా నటించిన యంగ్ హీరో క్రాంతితో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు?

స) నా చిన్నప్పటి నుంచి నేను సినిమాల్లో ఉండాలి అనుకున్నాను. నా చిన్నప్పుడు నేను ఒక సీరియల్ లో కూడా నటించాను. అదే నన్ను ఈ ఫీల్డ్ వైపుకి బాగా అట్రాక్ట్ చేసింది. అంతకంటే మా నాన్నగారికి కూడా సినిమాలంటే ఇష్టం. నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పినప్పుడు నాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు.

ప్రశ్న) ‘ఆ ఐదుగురు’ మీ మూడవ సినిమా.. ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో లీడ్ రోల్స్ కోసం కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చారు. ఆడిషన్ కి వెళ్లి కీలకమైన పాత్రకి సెలెక్ట్ అయ్యాను. ఇందులో నా పాత్ర పేరు జాన్. ఫ్యామిలీ ఇబ్బందులతో బాగా ఇబ్బంది పడే ఓ కుర్రాడు ఎలా అకాడమీకి వచ్చి తన భవిష్యత్తును మార్చుకున్నాడు అనేదే నా పాత్ర కథ.

ప్రశ్న) మీరు ఇంతకముందు చేసిన సినిమాల గురించి చెప్పండి?

స) ‘దునియా’ అనే సినిమాలో హీరోగా చేసాను. అ సినిమాకి నాకు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎల్.బి.డబ్ల్యూ సినిమాలో ఒక చిన్న రోల్ చేసాను. అలాగే ‘జగమే మాయ’ అనే సినిమా కూడా చేసాను. అది త్వరలో రిలీజ్ కానుంది.

ప్రశ్న) సోలోగా సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు?

స) నా వరకూ ‘ఆ ఐదుగురు’లో చేసిన క్యారెక్టర్ రోల్ కాదు. సినిమాలో అతను కూడా ఓ హీరో. నా పాత్రకి సినిమాలో ప్రాముఖ్యత ఉంది. నా వరకూ ఏ పాత్ర చేస్తున్నామా అన్నది కాదు, నా పాత్ర సినిమా కథని ముందుకు తీసుకెళ్తుందా? లేదా? అన్నదే ముఖ్యం. ఎందుకంటే అప్పుడే కదా నాకు గుర్తింపు వచ్చేది.

ప్రశ్న) మీరు భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?

స) నేను ఇప్పుడిప్పుడే వస్తున్న ఒక నటున్ని, నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. చెప్పాలంటే సినిమాలో నేను చేసేది చిన్న పాత్రే అయినా నలుగురికి గుర్తుండేది అయితే చేస్తాను. నేను ఈ సినిమాలకే పరిమితం అనే బోర్డర్ పెట్టుకోదలుచుకోలేదు.

ప్రశ్న) ప్రస్తుతం ఎంతోమంది యంగ్ స్టర్స్ వస్తున్నారు. బాగా కాంపిటీషన్ ఉంటుంది. దాన్ని మీరెలా తట్టుకోగలుగుతున్నారు?

స) ప్రస్తుతం ప్రతి ఫీల్డ్ లోనూ కాంపిటీషన్ ఉంది. ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి వారి బెస్ట్ ఇవ్వాలి. నీ పెర్ఫార్మన్స్ నిన్ను మాట్లాడేలా చేస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మిమ్మల్ని ఇంకొకరు ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది.

ప్రశ్న) మీలాంటి యంగ్ హీరోస్ పేస్ చేసే ఇబ్బందులేమిటి.?

స) నాలాంటి హీరోలకి చాలా సమస్యలు ఉంటాయి. ఒక సినిమాకి సెలక్ట్ అయ్యాక ఆ సినిమా త్వరగా సెట్స్ పైకి వెళ్లి త్వరగా పూర్తవదు. ఒకసారి సినిమా పూర్తయ్యాక అది రిలీజ్ అవ్వడం కోసం మళ్ళీ పలు సమస్యలు వస్తాయి. చాలా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఓపికతో వెయిట్ చెయ్యగలిగితే సక్సెస్ వస్తుంది.

ప్రశ్న) మీరు తదుపరి చేయనున్న సినిమాలేమిటి?

స) ఇది వరకూ చెప్పినట్టు జగమే మాయ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. ఇది కాకుండా న్యూ డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది.

ప్రశ్న) మీరు చేయాలనుకునే డ్రీం రోల్స్ ఏమన్నా ఉన్నాయా.?

స) నాకు ఎప్పటికైనా ఓ పౌరాణిక సినిమాలో నటించాలని ఉంది. అలాంటి పాత్రలంటే నాకు చాలా ఇష్టం.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగుంచి క్రాంతికి ఆల్ ది బెస్ట్ చెప్పాం..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు