ప్రత్యేక ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – నా సినిమా గురించి నా మూవీ పోస్టర్ లేదా ట్రైలర్ మాత్రమే మాట్లాడాలి.

ప్రత్యేక ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – నా సినిమా గురించి నా మూవీ పోస్టర్ లేదా ట్రైలర్ మాత్రమే మాట్లాడాలి.

Published on Jul 9, 2014 11:01 AM IST

ram-gopal-varma
ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమా ద్వారా గానీ లేదా వివాదాస్పద వాఖ్యలతో గానీ ఎప్పుడు వార్తల్లో నిలిచే డైరెక్టర్ ఎవరు అంటే చెప్పే పేరు రామ్ గోపాల్ వర్మ. తన సినిమా పబ్లిసిటీ కోసం వర్మ పలు రకాల స్టంట్స్ చేస్తుంటాడు. వర్మ ఫ్లో కామ్ టెక్నాలజీని పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘ఐస్ క్రీమ్’. ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఐస్ క్రీమ్ సంగతులు ఏంటో తెలుసుకోవడానికి వర్మతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) ముందుగా మీ సినిమాల ఫస్ట్ లుక్ వచ్చేంత వరకూ అసలు సినిమా ఎప్పుడు మొదలైంది, పూర్తయ్యింది తెలియదు. అలా చేయడం వెనకున్న కారణం ఏమిటి.?

స) నేను ఎప్పుడూ నా సినిమా రెడీ అయ్యేంతవరకూ మూవీ గురించి సీక్రెట్ గా ఉంచాలనుకుంటాను, కానీ కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న వాళ్ళు రివీల్ చేసేస్తూ ఉంటారు. నా వరకూ నా సినిమా గురించి నా సినిమా పోస్టర్ లేదా ట్రైలర్ మాట్లాడాలి అనుకుంటాను. అంతేగాని ముందే వచ్చే పలు వార్తలు మాట్లాడకూడదు.

ప్రశ్న) అసలు తేజస్విని హీరోయిన్ గా తీసుకోవడానికి గల కారణం ఏమిటి??

స) నేను తేజస్వి ని ముందుగా ముంబైలో చూసాను. తేజస్వి నాకు కాస్త దూరంగా హార్ట్ అటాక్ హీరోయిన్ ఆద శర్మతో కలిసి నిల్చోని ఉంది. సినిమాటోగ్రాఫర్ అమోల్ రాథోడ్ వచ్చి హార్ట్ అటాక్ హీరోయిన్ తనే అని వాళ్ళ వైపు చూపించాడు. నేను పొరపాటు పడి తేజస్వి హీరోయిన్ అనుకున్నాను. తను మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది, అలాగే తను నా మైండ్ లో బాగా రిజిస్టర్ అయిపొయింది. కొద్ది రోజులకి పూరి జగన్నాధ్ చెప్పాడు ఆద శర్మ అసలు హీరోయిన్ అని. అలాగే నేను విష్ణు సినిమాలో ఓ అతిధి పాత్ర కోసం ఎవరైతే బాగుంటుందా అని పూరిని అడిగితే తను తేజస్విని సజెస్ట్ చేసాడు. తనని షూటింగ్ స్పాట్ లో చూసిన నేను తనే ఐస్ క్రీమ్ సినిమాలో హీరోయిన్ అని ఫిక్స్ అయ్యాను.

ప్రశ్న) ప్రస్తుతం ఈ సినిమాలోని న్యూడ్ సీన్ గురించే అంతా చర్చలు జరుగుతున్నాయి. దాని గురించి కాస్త చెప్పరా.?

స) చూడండి.. మన సెన్సార్ రూల్స్ ప్రకారం మన సినిమాల్లో ఓ అమ్మాయిని న్యూడ్ గా చూపించలేం. మేము ఈ సినిమాలో ఫ్లో కామ్ టెక్నాలజీ వాడడం వలన న్యూడ్ సీన్ ఎఫెక్ట్స్ బాగా ఆసక్తిగా వచ్చాయి. అది ఎలా ఉందా అనేది మీరు స్క్రీన్ మీద చూసే తెలుకోవాలి.

ప్రశ్న) రాజశేఖర్ తో చేసిన పట్ట పగలుకి ఏమైంది? ఎందుకు వాయిదా పడింది?

స) రాజశేఖర్ డేట్స్ ప్రకారం ఈ సినిమాని ముందుగా షూట్ చేసాం. అప్పుడు కొన్ని సీన్స్ బాలన్స్ ఉండిపోయాయి. ఆ సీన్స్ ని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఫినిష్ చేయలేకపోయాం. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యింది. కొంత సిజి వర్క్ మాత్రం బాలన్స్ ఉంది. అది పూర్తవగానే ఆగష్టు లో మూవీ ని రిలీజ్ చేస్తాం.

ప్రశ్న) ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ సినిమా తీయడం వల్ల విమర్శకులు మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తుంటారు. అవి మిమ్మల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్తాయా?

స) నవ్వుతూ..! విమర్శలు అనేవి నా జీవితంలో ఒక భాగమైపోయాయి. చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తుంటారు కానీ అవి నన్ను ఏమీ ఇబ్బంది పెట్టవు.

ప్రశ్న) సర్కార్ 3 సెట్స్ పైకి వెళ్ళడానికి ఎందుకు ఆలస్యమవుతోంది?

స) ముందుగా అనుకున్న దాని ప్రకారం ఆగష్టులో సెట్స్ పైకి వెళ్ళాలి. కానీ కొన్ని ప్రీ ప్రొడక్షన్ పనుల వల్ల ఆ సినిమా నవంబర్ కి వాయిదా పడింది.

ప్రశ్న) నవంబర్ అంటే మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఈ టైంలో వేరే ఏమన్నా సినిమా చేస్తున్నారా?

స) అవును.. ప్రస్తుతం ఓ హిందీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాను. అది కూడా మరో ప్రయోగాత్మక సినిమా అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాకి టైటిల్, నటీనటులు ఎవరు అనేది అనుకోలేదు.

ప్రశ్న) ఈ సినిమా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు అంటే విమర్శకులు మిమ్మల్ని మళ్ళీ విమర్శిస్తారు? మీరు రివ్యూస్ చదివి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారా.?

స) మళ్ళీ నవ్వుతూ.. ఇందాకే చెప్పినట్టు విమర్శలు అనేది నా లైఫ్ లో ఓ పార్ట్ అయిపోయాయి. అలాగే నేను రివ్యూస్ ని నేను చూడను. నా వరకూ సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను.

ప్రశ్న) ప్రస్తుతం బడ్జెట్, బ్యానర్ అంటూ సినిమాలు చేస్తున్నారు. కానీ మీరెలా అన్ని సినిమాలు చేస్తున్నారు?

స) ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ ముందు బడ్జెట్స్ అనేది ఓ పెద్ద స్టుపిడ్ పని. స్మార్ట్ గా టెక్నాలజీని ఉపయోగించి సినిమాలు ఎలా తీయాలా అనేది నేర్చుకోవాలి.

ప్రశ్న) చివరిగా ‘ఐస్ క్రీమ్’ సినిమా ఎందుకు చూడాలి అంటారు.?

స) ఈ సినిమాలో సూపర్బ్ సౌండ్, కెమెరా మరియు టెక్నికల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని చుట్టూ కథ నడిపిస్తూ ఓ కొత్త కాన్సెప్ట్ చెప్పడానికి ట్రై చేసాను, నా వరకూ నేను సక్సెస్ అయ్యాను. ఇక ఈ సినిమా నచ్చడమా లేదా అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి రామ్ గోపాల్ వర్మకి ఆల్ ది బెస్ట్ చెప్పాం..

CLICK HERE FOR TELUGU INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు