నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా ఇదే – గోపీచంద్
Published on Jul 17, 2017 9:15 am IST


హీరో గోపీచంద్ నటించిన ‘గౌతమ్ నంద’ చిత్రం యొక్క ఆడియో వేడుక నిన్న సాయంత్రం జరిగింది. ఈ సందర్బంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘సంపత్ నంది మొదట కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. కానీ బడ్జెట్ ఎక్కువవుతుందేమోనని అనుకున్నా. కానీ నిర్మాతలు బాగా సహకరించి సినిమాను పూర్తి చేశారు’ అన్నారు.

అలాగే ‘సంపత్ నంది కథే చెప్పేటప్పుడు ఏం చెప్పాడో మేకింగ్ అప్పుడు కూడా అదే తీశాడు. ఒక్క డైలాగ్ కూడా తేడా లేకుండా చేశాడు. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన సినిమా ఇదే. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇక థమన్ తో చాలా గ్యాప్ తర్వాత వర్క్ చేశా. సినిమా తనకి బాగా నచ్చింది కాబట్టి ప్రాణం పెట్టి పని చేశాడు. ఆర్.ఆర్ అదిరిపోయే స్థాయిలో ఉంటుంది’ అన్నారు. హన్సిక, క్యాథెరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను జూలై 28న రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా యొక్క నైజాం హక్కుల్ని రూ. 6.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం.

 
Like us on Facebook