హ్యాపీ వెడ్డింగ్ ఫస్ట్ లుక్ విడుదల తేది ఖరారు !
Published on Feb 13, 2018 12:36 am IST

సుమంత్ అశ్విన్, నీహారిక హీరో హీరోయిన్ గా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పేరు హ్యాపీ వెడ్డింగ్. యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 14 న ఉదయం 7 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు భవాని ప్రసాద్ మాటలు రాస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ కాబోతుందని సమాచారం. ఈ సినిమాలో నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా సుమంత్ అశ్విన్ మరియు నీహారిక కెరిర్ కు కీలకం. ఫ్యామిలి అండ్ లవ్ స్టోరి తో రానున్న ఈ సినిమా షూటింగ్ తక్కువ కాలంలో పూర్తి చేసాడు దర్శకుడు లక్ష్మణ్.

 

Like us on Facebook