‘హైపర్’ కృష్ణా జిల్లా లేటెస్ట్ కలెక్షన్స్!

‘హైపర్’ కృష్ణా జిల్లా లేటెస్ట్ కలెక్షన్స్!

Published on Oct 2, 2016 8:21 PM IST

hyper-ram

రామ్ హీరోగా నటించిన ‘హైపర్’ సినిమా గత శుక్రవారం (సెప్టెంబర్ 30న) పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు భారీ అంచనాలను మూటగట్టుకున్న ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్ళు రాబడుతోంది. ముఖ్యంగా పక్కా మాస్ కమర్షియల్ సినిమా కావడంతో టార్గెట్ ఆడియన్స్ దగ్గర్నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కృష్ణా జిల్లాలో మొదటి రెండు రోజుల్లో హైపర్ 32,68,546 రూపాయల షేర్ వసూలు చేసింది. ఆదివారంతో పాటు ఆ తర్వాత వచ్చే సెలవు దినాలు సినిమాకు మరింత బాగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీమ్ విడుదల తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తోంది. రామ్‌కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించారు. 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూర్చారు. తండ్రి అంటే విపరీతమైన ఇష్టం ఉండే ఓ ఆసక్తికర పాత్రలో రామ్ ఇందులో మెప్పించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు