ఎన్టీఆర్ – చరణ్ సీన్స్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

ఎన్టీఆర్ – చరణ్ సీన్స్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Mar 22, 2020 11:01 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో మొదటి సారి వీరిద్దరు కలుసుకునే సన్నివేశాల గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. కొంతమంది ఆటవికులను కాపాడే క్రమంలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఓ వీరోచిత పోరాటం చేసే సందర్భంలో.. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ చూస్తాడట. అలా భీంని చూసి రాజు అతని పట్ల అమితమైన గౌరవాన్ని పెంచుకుంటాడట.

‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ సినిమా నిర్మితమవుతుంది.

కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు