ఇంటర్వ్యూ: క్రిష్ – శాతకర్ణి పాత్రను బాలకృష్ణ కన్నా బాగా ఎవరూ చేయలేరు !

ఇంటర్వ్యూ: క్రిష్ – శాతకర్ణి పాత్రను బాలకృష్ణ కన్నా బాగా ఎవరూ చేయలేరు !

Published on Jan 9, 2017 4:30 PM IST

krish-int
ప్రతి సినిమాని సామాజిక దృక్పథంతో తెరకెక్కించే దర్శకుడు క్రిష్ తాజాగా రూపొందించిన చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. జనవరి 12 సినిమా విడుదల సందర్బంగా బాలకృష్ణ 100వ సినిమాగా, శాతకర్ణి మహారాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రంగా ప్రత్యేకతను సంతరించుకున్న ఈ సినిమా విశేషాలను క్రిష్ మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) చాలా మందికి పెద్దగా తెలియని శాతకర్ణి పై సినిమా చేయాలని ఎందుకనిపించింది ?
జ) అవును. శాతకర్ణి గురించి చాలా మందికి సరిగా తెలీదు. అందుకే ఆయన గొప్పతనాన్ని చూపించాలని మన పూర్వపు తెలుగు రాజులు మన కోసం ఏం చేశారో తెలియజెప్పాలని ఈ సినిమా చేశాను.

ప్ర) ఈ సినిమా కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు ?
జ) ఈ సినిమా కోసం మూడేళ్లు చాలా రీసెర్చ్ చేశాను. నాకు తెలిసిన చాలా మందిని కలిశాను. ఆయన గురించి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా చదివాను. అయినా కూడా పెద్ద మొత్తంలో ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నాకు లభించిన సమాచారాన్ని, నేను నమ్మిన విషయాలని బట్టి సినిమా తీశాను.

ప్ర) బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ రాసుకున్నారా ?
జ) అవును. ఈ ప్రాజెక్ట్ పై మొదటిరోజు పని మొదలుపెట్టేటప్పుడే బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేశా. అయన ఒప్పుకోకపోయుంటే ఈ సినిమా అసలు ఉండేదే కాదు. ఈ పాత్రను బాలకృష్ణ కన్నా బాగా వేరెవరూ చేయలేరు

ప్ర) ఈ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణగారిని ఎలా ఒప్పించారు ?
జ) నేను బాలకృష్ణగారిని కలిసిన రోజున ఆయన ఒక గంటలో స్టోరీ చెప్పాలని అన్నారు. నేను కథ చెప్పడం మొదలుపెట్టగానే ఆయన బాడీ లాంగ్వేజ్ లో మార్పులను గమనించా. అప్పుడే అర్థమయింది కథ అయనకు నచ్చిందని. గంట గడిచిన నేను కథ చెప్పడం ఆపలేదు. రెండు గంటల పాటు చెప్పా. అంతా విన్న వెంటనే అయన మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారు.

ప్ర) సినిమాని ఇంత త్వరగా ఎలా పూర్తి చేయగలిగారు ?
జ) నేను సినిమా మొదలుపెట్టడానికి ముందే అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడు, ఏ లొకేషన్లో ఏ షాట్ తీయాలి, ఎవరు ఏ డైలాగ్ చెప్పాలి. ఏ బట్టలు వేసుకోవాలి అన్నీ టీమ్ తో కూర్చుని ముందే ప్లాన్ చేసుకున్నాను. అందుకే ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. పైగా చాలా రోజుల ముందే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాం.

ప్ర) సినిమాని అంత త్వరగా ఎందుకు పూర్తి చేశారు ?
జ) మాకున్న బడ్జెట్ లిమిటెడ్ గా ఉంది. అందుకే ఎక్కడా వృధా ఖర్చులకు వెళ్లకుండా, పొరపాట్లు జరగకుండా చూసుకున్నాను. అందుకే డెడ్ లైన్ దృష్టిలో పెట్టుకుని పనిచేశా.

ప్ర) బాహుబలికి, శాతకర్ణికి మధ్య పోలికేంటి ?
జ) రెండు భిన్నమైన సినిమాలు. బాహౌబలి ఫాంటసీ సినిమా. అందుకే దాన్ని రూపొందించడానికి చాలా టైమ్ పట్టింది. కానీ శాతకర్ణి వాస్తవ చరిత్ర. అందుకే కథ విషయంలో పెద్దగా టైమ్ పట్టలేదు. ఈ సినిమాలో డ్రామాను చాలా గ్రిప్పింగా చెప్పాను.

ప్ర) రాజమౌళి ట్రైలర్ ను అభినందించడం గురించి ?
జ) నేను రాజమౌళికి పూర్తి కథ చెప్పినప్పుడు ఆయన నాకో గొప్ప సలహా చెప్పారు. అదేమిటంటే కథ సహజమైంది కాబట్టి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడకుండా నేచ్యురల్ గా సినిమా తీయమని, అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ తక్కువ టైమ్ లో పూర్తవుతుందని చెప్పారు. నేను కూడా అలాగే చేశా.

ప్ర) సోషల్ మీడియాలో రెండు సినిమాల మధ్య జరుగుతున్న పోటీ గురించి ఏమంటారు ?
జ) ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలు చాలా డిసప్పాయింటింగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు తామేంటి, తాము జీవితంలో ఏం సాధించాం అనేది చూసుకోకుండా పక్కవారిని టార్గెట్ చేస్తుంటారు. అది మంచిది కాదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు