ఇంటర్వ్యూ : రఘు కరుమంచి – కచ్చితంగా నా బ్యానర్లో ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాను.

ఇంటర్వ్యూ : రఘు కరుమంచి – కచ్చితంగా నా బ్యానర్లో ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాను.

Published on May 11, 2015 5:09 PM IST

raghu

‘డిచ్చి కొట్టి సంపేస్తా’ తెలంగాణ యాసలో మాట్లాడుతూ అంటూ తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న కమెడియన్ రఘు కరుమంచి. ఇప్పటి వరకూ సుమారు 150కి పైగా సినిమాలలో డిఫరెంట్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అంతే కాకుడా బాగా ఫేమస్ అయిన బుల్లితెర జబర్దస్త్ షో లో కూడా రోలర్ రఘుగా బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. రేపు రఘు పుట్టిన రోజు ఈ సందర్భంగా తనతో కాసపు ముచ్చటించాం.. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ప్రతి ఏడాది మీ పుట్టిన రోజుని ఎలా జరుపుకుంటారు.?

స) ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజు నాడు మొదటగా గుడికి వెళ్తాను, ఆ తర్వాత అటునుంచి ఓల్డేజ్ హోంకి వెళ్లి ఎంజాయ్ చేసాను. ఈ సారి నా సినిమా జర్నీని, నా ఆనందాన్ని మీడియాతో పంచుకోవాలి అనిపించి ఇలా మీతో భేటీ అయ్యాను.

ప్రశ్న) మీ ఫ్యామిలీ మరియు ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి.?

స) మా సొంత ఊరు తెనాలి కానీ నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్ లోనే.. నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ హౌస్ వైఫ్. నేను ఎంబిఏ కంప్లీట్ చేసి కొన్ని సంవత్సరాలు సాఫ్ట్ వేర్ లో పనిచేసాను. నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ప్రశ్న) మిమ్మల్ని సినీ పరిశ్రమ వైపు నడిచేలా చేసిన వ్యక్తులెవరు.?

స) నాకు వివి వినాయక్, సురేందర్ రెడ్డి మంచి ఫ్రెండ్స్.. వాళ్ళు సినిమాల్లోకి రాకముందు నుంచి నాకు వాళ్ళతో మంచి సాన్నిహిత్యం ఉంది. వారిద్దరి ప్రభావంతోనే కమెడియన్ గా సినిమాల్లోకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే నాకు మంచి కెరీర్ ఉందని ఇక్కడే సెటిల్ అయ్యాను.

ప్రశ్న) మీ కెరీర్ కి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ ఏది.?

స) కమెడియన్ గా నాకు ‘అదుర్స్’ సినిమా కెరీర్ కి కావాల్సిన బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాతో ఆడియన్స్ దగ్గర నుంచి నాకు మార్కులు పడ్డాయి. అదుర్స్ తర్వాత సుమారు నేను 120 సినిమాలలో నటించాను.

ప్రశ్న) మీకు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పండి.?

స) యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నాకు పెద్దన్నయ్య లాంటి వారు.. ఆయన ఆది సినిమాతో నా జర్నీ మొదలు పెట్టాను. ఆ తర్వాత ఆయనతో కలిసి 14 ఏళ్ళగా ట్రావెల్ చేస్తున్నాను.

ప్రశ్న) అసలు మిమ్మల్ని కమెడియన్ గా మార్చడానికి గల కారణం.?

స) నా బాడీ లాంగ్వేజ్, నా మాటలలో వచ్చే యాస మరియు జోవియల్ గా ఉండే నా ఒరిజినల్ క్యారెక్టర్ ని చూసి దర్శకులే నన్ను కమెడియన్ ని చేసారు.

ప్రశ్న) కిక్ 2 సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.?

స) కిక్ 2 లో నేను ఓ పల్లెటూరి వాడిగా కనిపిస్తాను. సినిమాలో చాలా ఆసక్తికరమైన పాత్ర, ఆ పాత్ర చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది.

ప్రశ్న) మీరు చేసే పాత్రలకి ఎంతవరకూ రెమ్యునరేషన్ తీసుకుంటారు.?

స) నేను ఇప్పటి వరకూ ఏ నిర్మాతని ఇంత రెమ్యునరేషన్ ఇమ్మని డిమాండ్ చెయ్యలేదు. నేను ఎప్పుడూ నిర్మాతలు, దర్శకులతో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తాను. ఎప్పుడూ ఆలస్యం చేయకుండా వారు చెప్పిన రూల్స్ ఫాలో ఆవుతుంటాను.

ప్రశ్న) సినిమాలు నిర్మించాలి అనే ఆలోచనలో ఏమన్నా ఉన్నారా.?

స) కచ్చితంగా సినిమాలు నిర్మిస్తాను. కచ్చితంగా నా సొంత ప్రొడక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా చేస్తాను. కానీ దానికి ఇంకా చాలా సమయం ఉంది. నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు అనౌన్స్ చేస్తాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, కెరీర్ పరంగా రఘుకి ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రఘుకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేశాం..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు