ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమానే ‘ది ప్యారడైజ్’. నాచురల్ స్టార్ నాని హీరోగా తన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో చేసిన ఈ సినిమా ఇప్పుడు భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది. అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమాతో నాని బిగ్గెస్ట్ ఓపెనర్ సెట్ చేయడం ఖాయం అని అంతా అనుకున్నారు. ఇక ఫైనల్ గా ఆ బిగ్ డే రాబోతుంది.
మేకర్స్ సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రపంచ వ్యాప్తంగా ఓ రోజు ముందే ప్రీమియర్స్ వేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక అలా ఎట్టకేలకి బుకింగ్స్ ని ఓపెన్ చేయగా నైజాం, ఏపీ లలో క్రేజీ రెస్పాన్స్ ఇపుడు కనిపిస్తుంది. ఏపీ, తెలంగాణ అని సంబంధం లేకుండా టికెట్ రేట్స్ కూడా సంబంధం లేకుండా ఆడియెన్స్ హౌస్ ఫుల్స్ పెడుతున్నారు. ఇలా మొత్తానికి ప్యారడైజ్ ప్రీమియర్స్ తోనే మాస్ రెస్పాన్స్ మొదలైంది. ఇంకా ముల్టీప్లెక్స్ లలో కూడా సినిమా బుకింగ్స్ తెరుచుకోవాల్సి ఉంది.


