ఇంటర్వ్యూ : రాహుల్ రవీంద్రన్ – ‘అలా ఎలా?’లో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు నచ్చింది.

ఇంటర్వ్యూ : రాహుల్ రవీంద్రన్ – ‘అలా ఎలా?’లో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు నచ్చింది.

Published on Nov 29, 2014 1:43 PM IST

RAhul
ఒక మంచి సినిమా తీశామా.? లేదా..? అనేది నాకు ముఖ్యం. సోలో హీరోగా నటించాలి అనే నియమాలు పెట్టుకోలేదు. మంచి స్క్రిప్ట్ దొరికితే.. హిట్ సినిమాలో ప్రాముఖ్యత (ఇంపార్టెంట్ రోల్) గల పాత్ర చేయడానికి నేను రెడీ. అని అన్నారు యువ హీరో రాహుల్ రవీంద్రన్. వెన్నెల కిషోర్, షాని సల్మాన్ ముఖ్య పాత్రధారులుగా.. రాహుల్ హీరోగా నటించిన ‘అలా ఎలా?’ సినిమా ఈ శుక్రవారం విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో సమావేశం అయ్యారు. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ప్రేక్షకుల నుండి ‘అలా ఎలా?’ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుంది..?

స) నేను, వెన్నెల కిషోర్, షాని సల్మాన్ కలసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, పంచ్ డైలాగులకు మంచి స్పందన లభిస్తుంది. భీమ్స్ సంగీతం, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమా విజయానికి హెల్ప్ అయ్యాయి. అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్ వస్తుంది. చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న) వ్యక్తిగతంగా ఈ సినిమా విజయం మీ కెరీర్ కు ఎంతవరకూ ఉపయోగపడింది..?

స) ‘అందాల రాక్షసి’ సినిమాతో నటుడిగా మంచి పేరొచ్చింది. సెటిల్ పెర్ఫార్మన్స్ చేశాడు అని అన్నారు. ‘అలా ఎలా?’ సినిమాతో ఈ కుర్రాడు కామెడీ సన్నివేశాలలో కూడా బాగా నటించాడు అని పేరొచ్చింది. ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నాను.

ప్రశ్న) దర్శకుడు అనీష్ కృష్ణ వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి..?

స) ఒక సన్నివేశం వివరించిన తర్వాత మీ స్టైల్ లో చేయండి అని చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అతనిలో మంచి సెన్స్ అఫ్ హ్యుమర్ ఉంది. అలాగే మీకు స్పాంటేనియస్ గా ఏమైనా డైలాగ్స్ తడితే చెప్పండి అని ఎంకరేజ్ చేసేవారు. ముగ్గురం హీరోలమే, ఫ్రెండ్స్ కాదు అని వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ స్పాట్ లో చెప్పిందే. మా ముగ్గురి క్యారెక్టర్లను బాగా డిజైన్ చేశారు.

ప్రశ్న) సోలో హీరోగా హిట్ కోసం ట్రై చేయడం లేదా..?

స) ఒక మంచి సినిమా తీశామా.? లేదా..? అనేది నాకు ముఖ్యం. సోలో హీరోగా నటించాలి అనే నియమాలు పెట్టుకోలేదు. మంచి స్క్రిప్ట్ దొరికితే.. హిట్ సినిమాలో ప్రాముఖ్యత (ఇంపార్టెంట్ రోల్) గల పాత్ర చేయడానికి నేను రెడీ. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడు ఎంజాయ్ చేయడం, హ్యాపీగా బయటకు రావడం ముఖ్యం.

ప్రశ్న) సినిమాలో మ్యారేజ్ మీద ఎక్కువ సటైర్లు వేశారు. మీ భార్య చిన్మయి సినిమా చూసి ఏమన్నారు..?

స) హీరోయిన్ హెబ్బా పటేల్ పాత్రకు(శృతి) చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అప్పుడే సినిమా హిట్ అవుతుందని చెప్పింది. అమ్మాయిలు రొమాంటిక్ సన్నివేశాలు, అబ్బాయిలు కామెడీ పంచ్ డైలాగులు ఇష్టపడతారు అని అంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ తనకు బాగా నచ్చింది. పెళ్ళైన తర్వాత విడుదలైన మొదటి సినిమా ఇది. యాదృశ్చికంగా ఈ సినిమాలో మ్యారేజ్ మీద సటైర్లు పడ్డాయి, అంతే.

ప్రశ్న) కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఈ సినిమా తీశారా..?

స) లేదండి, అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. రీజనల్ సినిమాలకు సింగిల్ స్క్రీన్ లలో రెవిన్యూ చాలా ఇంపార్టెంట్. మల్టీప్లెక్స్ కలెక్షన్స్ నిర్మాతకు లాభాలు తీసుకురాలేవు. బి, సి సెంటర్స్ ఆడియన్స్ కి ‘అలా ఎలా?’లో ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చింది. త్వరలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్యను పెంచుతున్నాం.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి..?

స) తెలుగులో ‘హైదరాబాద్ లవ్ స్టొరీ’ అనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాను. త్వరలో విడుదలవుతుంది. సందీప్ కిషన్ తో కలసి నటిస్తున్న ‘టైగర్’ షూటింగ్ జరుగుతుంది. ‘టైగర్’ స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. తమిళంలో ‘సెగ’ ఫేం అంజనా అలీ ఖాన్ దర్శకత్వంలో ఒక సినిమా అంగీకరించాను. ఎక్కువ తెలుగు సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు