జేమ్స్ బాండ్ తో ఊపిరి పీల్చుకున్న అల్లరి నరేష్

జేమ్స్ బాండ్ తో ఊపిరి పీల్చుకున్న అల్లరి నరేష్

Published on Jul 31, 2015 1:09 AM IST

James-Bond
అల్లరి నరేష్ నటించిన తాజా ఎంటర్టైనర్ జేమ్స్ బాండ్ విడుదలైన అన్ని ఏరియాలలో మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పడుతున్నట్టు సమాచారం. అల్లరి నరేష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కామెడీ పరంగా సక్సెస్ అయ్యింది. ప్రచారంలో భాగంగా నరేష్ ఆంధ్రాలో వివిధ థియేటర్ లలో సక్సెస్ టూర్ ప్లాన్ చేశాడు.

ఇప్పుడు ఈ నెల 31న హైదరాబాద్ FNCC దగ్గర మరో సక్సెస్ మీట్ నిర్వహించనున్నాడు. ఈ వేడుకలో యావత్ చిత్ర బృందమంతా హాజరుకానుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు మంచి ధరకు ప్రముఖ ఛానల్ సొంతం చేస్కుంది. సాయి కిషోర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సాక్షి చౌదరి హీరోయిన్. ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు