రేపు ఎన్.టి.ఆర్ పొలిటికల్ ప్రెస్ మీట్?

రేపు ఎన్.టి.ఆర్ పొలిటికల్ ప్రెస్ మీట్?

Published on Apr 23, 2014 1:04 PM IST

ntr
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచార జోరు పెరుగుతోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ టిడిపి. ఈ పార్టీ తరపున నందమూరి హీరోలు ఎవరి వంతు కృషిగా వాళ్ళు ప్రచారం చేస్తుంటే గత ఎన్నికల్లో హల్ చల్ చేసిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాత్రం ఈ సారి ప్రచారానికి దూరంగా ఉన్నాడు. దీనికి కారణం కుటుంబలోని కలహాలే అని బయట ప్రచారం జరుగుతోంది. మరోవైపు టిడిపి ప్రచారంలో ఎన్.టి.ఆర్ లేకపోవడం కూడా ఒక తీరని లోటు అని కొందరు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేపు ఎన్.టి.ఆర్ ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్లో తన మద్దతు తెలుదేశం పార్టీకే అని అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఇదే జరిగితే ప్రస్తుతం అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో ఉన్న చాలా అనుమానాలు తొలగిపోతాయి.

ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రభస’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గంధర్వమహల్లో జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు