శంకర్, కమల్ ల ‘ఇండియన్-2’ ఆగిపోలేదట !

విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ ల కలయికలో ‘భారతీయడు’ కు సీక్వెల్ గా ‘ఇండియన్-2’ ను కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ ప్రకటితమైన దగ్గర్నుంచి దక్షిణాది ప్రేక్షకుల్లో సినిమా ఎలా ఉండబోతోందో అనే తీవ్రమైన ఆసక్తి మొదలైంది. కానీ గత రెండు రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందని, కమల్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో సూర్యను తీసుకునే యోచనలో దర్శకుడు శంకర్ ఉన్నారని రకరకాల వార్తలు బయటకొచ్చాయి.

కానీ చిత్ర పిఆర్ టీమ్, నిర్మాత సన్నిహితులు మాత్రం ఇవన్నీ ఒట్టి పుకార్లేనని, వీటిలో ఏమాత్రం నిజం లేదని తేల్చేశారు. అంతేగాక చిత్ర నిర్మాత దిల్ రాజు వేరే హీరో ఎవర్నీ అనుకోలేదని, కమల్ హాసనే చేస్తారని, దయచేసి ఇలాంటి అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దని అంటున్నారు. మరి ఈ వార్తలపై కమల్, శంకర్ లు ఎప్పుడు స్పందిస్తారో, ఇతర వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

 

Like us on Facebook