సానియా మీర్జాని సపోర్ట్ చేసిన లక్ష్మీ మంచు

సానియా మీర్జాని సపోర్ట్ చేసిన లక్ష్మీ మంచు

Published on Jul 28, 2014 9:32 PM IST

Lakshmi-Manchu
తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాని ఎంచుకున్నప్పటి నుంచి పలు వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నిర్ణయంలో కొంతమంది సానియా మీర్జాని సమర్దిస్తుంటే కొంతమంది ఏమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సానియా మీర్జాని సపోర్ట్ చేసే వారి జాబితాలో లక్ష్మీ మంచు కూడా చేరింది.

‘అయ్యిందేదో అయిపొయింది. ముందుగా మనవాళ్ళు స్పోర్ట్స్ పీపుల్ కి సరైన గుర్తింపు ఇవ్వరు. సానియా మీర్జాకి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయ్యే అర్హత ఉంది. తను తన లైఫ్ ని పూర్తిగా డెడికేట్ చేసి ఇండియా పరంగా టెన్నిస్ ని వెలుగులోకి తీసుకొని వచ్చింది. నా సపోర్ట్ సానియా మీర్జాకే..’ అని మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. ప్రతి విషయంలోనూ ఓపెన్ గా స్పందించే మంచు లక్ష్మీ ఈ విషయంలోనూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు