సెన్సార్ బోర్డు పై విరుచుకుపడిన లెజండరీ యాక్టర్

సెన్సార్ బోర్డు పై విరుచుకుపడిన లెజండరీ యాక్టర్

Published on Apr 17, 2015 11:40 AM IST

kamal-hassan
చిత్ర పరిశ్రమలో అందరు ఎంతగానో గౌరవించే నటుడు కమల్ హసన్ సెన్సార్ బోర్డు పై మరో సారి విరుచుకుపడ్డారు. సెన్సార్ బోర్డు తన క్రియేటివిటీని ఎంతో కాలంగా అనిచివేస్తుందని మండిపడ్డారు. అంతేకాకుండా తనకు సెన్సార్ సభ్యుల వల్ల ఎటువంటి సమస్య లేదని కాని వారు చిత్రాన్ని సెన్సార్ చేయడానికి పాటించే రూల్స్ వల్లే సమస్యని ఆయన అభిప్రాయపడ్డారు.

తన ‘ఉత్తమ విల్లన్’ చిత్రాన్ని విశ్వ హిందూ పరిషత్ బ్యాన్ చేయడం గురించి మాట్లాడుతూ తన హేతువాద ధోరణే కొన్ని మత మరియు రాజకీయ గ్రూపులు తన చిత్రాల పై దాడి చేయడానికి కారణమవుతున్నాయని తెలిపాడు. తన సినిమాలు మతాల చుట్టూ కాకుండా మనుషుల చుట్టూ తిరుగుతాయని తెలిపాడు.

క్లీన్ యు సర్టిఫికేట్ తో ‘ఉత్తమ విలన్’ సినిమా మే 1 న విడుదలకానుంది. అయితే చెన్నైలో విశ్వహిందూ పరిషత్ ఇంకా ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని పోలీసులను ఆశ్రయించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు