ఎప్పటికీ నాన్నే ఆదర్శం : మహేష్

ఎప్పటికీ నాన్నే ఆదర్శం : మహేష్

Published on Apr 1, 2015 6:06 PM IST

mahesh_babu4
సూపర్‌స్టార్ కృష్ణ నటుడిగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణ సినిమాల్లోకి అడుగుపెట్టి నిన్నటికి (మార్చి 31) సరిగ్గా 50 ఏళ్ళు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్త వాళ్ళతో తీసిన ‘తేనెమనసులు’ మార్చి 31, 1965న విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత కృష్ణ వెనుతిరిగే అవసరం లేకుండా వరుస చిత్రాలతో ముందు నటశేఖరుడిగా పిలవబడి ఆ తర్వాత సూపర్‌స్టార్‌గా ఎదిగారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఇలా చేపట్టిన అన్ని బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించారు.

కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన కుమారుడు మహేష్ బాబు అనతికాలంలోనే ఎవరికీ అందనంత ఎత్తుకు చేరారు. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గర ఉన్నది మహేషే! తన తండ్రి సినిమాల్లో 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. “తెలుగు సినిమా గర్వించే వ్యక్తుల్లో నాన్న గారికి ఎప్పుడూ స్థానం ఉంటుంది. సినిమాల్లో 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నామటుకు ఎప్పటికే నాన్నే ఆదర్శం!” అంటూ ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు మహేష్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న మహేష్, త్వరలోనే శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించే బ్రహ్మోత్సవం షూటింగ్‌లో పాల్గొంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు