నానితో మరోసారి జతకట్టనున్న టాలెంటెడ్ హీరోయిన్ ?
Published on Oct 18, 2016 8:42 am IST

nani-nivetha-thomas
ఈ సంవత్సరం నాని వరుసగా మూడు హిట్లందుకున్నాడు. వాటిలో ‘మోహన్ కృష్ణ ఇంద్రగంటి’ దర్శకత్వం వహించిన ‘జెంటిల్మెన్’ ఒకటి. ఈ చిత్రంలో నాని సరసన ఇద్దరు హీరోయిన్లు ‘సురభి, నివేదా థామస్’ లు నటించగా నివేదా థామస్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు దక్కాయి. ఒక రకంగా చెప్పాలంటే నివేదా కొన్ని సన్నివేశాల్లో సహజ నటుడు నానిని కూడా మించిపోయి చేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఈ హిట్ పెయిర్ మళ్ళీ జతకట్టనుందట. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నూతన దర్శకుడు శివ డైరెక్షన్లో నానై నటిస్తున్న సినిమాలో నివేదా హీరోయిన్ గా కుదిరిందట. ఈ సినిమా నిర్మత దానయ్య నిర్మిస్తారని, ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే యేడు జనవరిలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాని త్రినాథ్ నక్కిన డైరెక్షన్లో ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

 
Like us on Facebook