3 డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్న ఎన్.టి.ఆర్

3 డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్న ఎన్.టి.ఆర్

Published on Aug 31, 2014 12:43 AM IST

ntr

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఆగష్టు 2 నుంచి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో ఈ వారమే ఎన్.టి.ఆర్ జాయిన్ అయ్యాడని తెలియజేశాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినేమాగురించి మాకో ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే సినిమాలో ఎన్.టి.ఆర్ ఏకపాత్రాభినయంలో 3 డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు.

అందులో ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్ అని సమాచారం. మిగిలిన రెండు పాత్రలను కాస్త సీక్రెట్ గా ఉంచడం వలన అందరిలూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే ఈ మూడు డిఫరెంట్ పాత్రల్లో 3 డిఫరెంట్ లుక్స్ లో కనిపించే అవకాశం కూడా ఉంది. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ‘బాద్షా’ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే మొదటి సారి వక్కంతం వంశీ అందించిన కథకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు