ఇప్పటి నుండే హడావుడి మొదలుపెట్టిన పవన్ ఫ్యాన్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్, త్రివిక్రమ్ ల సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రేపే అధికారికంగా విడుదలకానున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఇప్పటి నుండే సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తూ తమ ఉత్సుకతను తెలియజేస్తున్నారు.

ఇప్పటివరకు ‘అజ్ఞాతవాసి’ అనే పేరు ప్రచారంలో ఉండగా టీమ్ అనుకుంటున్న టైటిల్ ఇదేనా లేకపోతే వేరే ఏమైనా ఉందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. పవన్, త్రివిక్రమ్ ల హిట్ కాంబినేషన్లో వస్తున్న 3వ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ట్రేడ్ వర్గాలు కూడా సినిమా ఓపెనింగ్స్, కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10న సంక్రాతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

 

Like us on Facebook