ఫైట్ సీన్ షూటింగ్‌లో పవన్ ‘సర్దార్’!

ఫైట్ సీన్ షూటింగ్‌లో పవన్ ‘సర్దార్’!

Published on Aug 3, 2015 9:20 PM IST

sardar-pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమా అనగానే ఆ సినిమా ప్రోగ్రెస్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ‘పవర్’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు బాబీతో ‘సర్దార్’ అన్న సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! గత కొన్నాళ్ళుగా రాజకీయపరమైన కార్యక్రమాలతోనే బిజీ అయిపోయిన పవన్ కొత్త సినిమాపై మొదట్నుంచీ స్పష్టత కనుమరుగైంది. అయితే తాజాగా ‘సర్దార్’ సినిమా సెట్లో పవన్ కనబడి సినిమా ప్రోగ్రెస్‌పై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

దర్శకుడు బాబీ పుట్టినరోజు సందర్భంగా ‘సర్దార్’ సెట్లో పవన్ కనిపించడంతో ఇక తమ హీరో సినిమా మొదలైపోయిందని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక అభిమానులను మరింత ఉత్తేజపరచే విషయమేమిటంటే, శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూండడం అని చెప్పాలి. ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్ పాల్గొంటుండగా ఓ ఫైట్ సీన్‌ షూట్ జరుగుతోంది. మరికొన్ని రోజులు ఈ షూటింగ్ ఇక్కడే జరగనున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో గడ్డం లుక్‌తో కనిపించిన పవన్, మళ్ళీ తనదైన క్లీన్ లుక్‌కు మారిపోయారు. శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అనిషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు