‘బెంగాల్ టైగర్’లో స్పెషల్ అట్రాక్షన్‌గా తమన్నా!

‘బెంగాల్ టైగర్’లో స్పెషల్ అట్రాక్షన్‌గా తమన్నా!

Published on May 27, 2015 9:19 AM IST

tamannah

తమన్నా.. కళ్ళు తిప్పుకోనివ్వని అందం, విలక్షణమైన నటనతో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. పాత్ర పరిధి మేరకు గ్లామరస్‌గా కనిపిస్తూ యువతకు హాట్ ఫేవరైట్‌గా మారిపోయింది తమన్నా. ఆమె గ్లామర్ చాలా సినిమాల విజయంలో కీలక పాత్ర వహించిందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ‘బెంగాల్ టైగర్‌’లో కూడా తమన్నా అందచందాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయని టాక్.

‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రవితేజ స్టైల్లో ‘బెంగాల్ టైగర్’ పేరుతో ఓ మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! శరవేగంగా జరిగిపోతున్న ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ ఈ మధ్యే మొదలైంది. ఈ షెడ్యూల్‌లో తమన్నా, రవితేజల మధ్య ఓ రొమాంటిక్ పాటను చిత్రీకరిస్తున్నారట. తమన్నా అందాలు ఈ పాటకు ప్లస్ కానున్నాయని తెలుస్తోంది. ఇక ఇదే సినిమాలో మరో భామ రాశిఖన్నా కూడా రవితేజ సరసన మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు