తమిళ్ లో రీమేక్ అవుతున్న స్టార్ హీరోయిన్ సినిమా..?

తమిళ్ లో రీమేక్ అవుతున్న స్టార్ హీరోయిన్ సినిమా..?

Published on May 28, 2016 10:57 AM IST

anjali
ప్రస్తుతం ఒక భాషలో ఓ సినిమా విజయవంతం అయ్యిందంటే దానిని రీమేక్ ద్వారానో, అనువాదం ద్వారానో ఇతరభాష ప్రేక్షకులకి అందించడానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి కారణం ఒక మంచి సినిమాని ఇతర భాష ప్రేక్షకులకి చూపించాలన్న ఆలోచనతో బాటు సక్సెస్ ని క్యాష్ చేసుకుందామన్న కోరిక కూడా ఒక కారణం.

ప్రస్తుతం ఓ తెలుగు సినిమా తమిళ్ లో రీమేక్ అవుతున్నట్టు సమాచారం. తెలుగులో అంజలి నటించిన ’గీతాంజలి’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్నట్లు సమాచారం. తమిళ్ లో ’పొల్లాదవన్’, ’జిగర్‌తండా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఫైవ్‌స్టార్ ఫిల్మ్స్ బానర్ ఈ సినిమా నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో సంగీతదర్శకుడు జి. వి. ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తుండగా తెలుగులో టైటిల్ పాత్రలో నటించిన అంజలి నటిస్తారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలతో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు