నైజాంలో 11 కోట్లు కలెక్ట్ చేసిన ‘టెంపర్’.

నైజాంలో 11 కోట్లు కలెక్ట్ చేసిన ‘టెంపర్’.

Published on Mar 5, 2015 6:16 PM IST

Temper-movie-review
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘టెంపర్’కు విడుదలైన తొలిరోజు నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘టెంపర్’తో అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగే హిట్ కొట్టారు ఎన్టీఆర్. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ కొల్లగొడుతుంది. నైజాంలో 11 కోట్ల షేర్ వసూలు చేసింది. విడుదలైన 20 రోజుల తర్వాత కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాదిస్తుంది.

ఈ సినిమా అందించిన ఉత్సాహంతో నిర్మాత బండ్ల గణేష్ సీక్వెల్ తీస్తున్నట్టు ప్రకటించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఎన్టీఆర్ క్యారేక్టరైజేషన్.. పూరి టేకింగ్, డైలాగ్స్.. కాజల్ గ్లామర్.. క్లైమాక్స్ ఎపిసోడ్.. సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయని అందరు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు