ముగ్గురు హీరోలకి కీలకంగా మారిన రేపటి శుక్రవారం !
Published on Nov 2, 2017 5:56 pm IST

ప్రతి శుక్రవారంలాగే రేపు కూడా సినిమాలు రిలీజవుతున్నాయి. అది కూడా మూడు సినిమాలు. ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ విశేషమేమిటంటే ఈ చిత్రాల్లో నటించిన ముగ్గురు హీరోకు తక్షణ హిట్ అత్యవసరం. ముందుగా ‘గరుడవేగ’ విషయానికొస్తే సీనియర్ హీరో రాజశేఖర్ చాలా ఏళ్ల తర్వాత చేసిన మంచి సినిమా కావడంతో, దీంతో హిట్ కొట్టి మరోసారి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆశపడుతున్నారు.

అలాగే మరొక యంగ్ హీరో ఆది సాయికుమార్ కూడా గత కొన్నాళ్లుగా మంచి కమర్షియల్ హిట్ లేక ఇబ్బంది పడుతూ ఈసారి చేస్తున్న ‘నెక్స్ట్ నువ్వే’ తో హిట్ ట్రాక్ ఎక్కాలని దృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇక మూడవ హీరో నాగ్ అశ్విన్ కూడా మొదటి సినిమా ‘వినవయ్యా రామయ్య’ ఆశించిన విజయం దక్కకపోవడంతో ఈసారి ఎలాగైనా హీరోగా మంచి గుర్తింపు ఊండాలని ‘ఏంజెల్’ సినిమా చేసి దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. కనుక ఈ మూడు సినిమాలు విలయం సాదించి ఈ ముగ్గురు హీరోలకు మంచి ఫలితాలు అందాలని మనమూ కోరుకుందాం.

 
Like us on Facebook