టాలీవుడ్ వారియర్స్ వశమైన ‘సిసిఎల్ 5’ ట్రోపీ

టాలీవుడ్ వారియర్స్ వశమైన ‘సిసిఎల్ 5’ ట్రోపీ

Published on Feb 1, 2015 6:40 PM IST

Telugu_Warriors1
ఒరిజినల్ క్రికెట్ మ్యాచ్ లకి ఏ మాత్రం తీసి పోకుండా ఇండియాలోని పలువురు ఇండస్ట్రీ స్టార్ హీరోస్ అంతా కలిసి ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ సిసిఎల్. ఈ సంవత్సరం జరిగిన సిసిఎల్ 5వ సీజన్ నేటితో ముగిసింది. మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన తెలుగు వారియర్స్ టీం సిసిఎల్ 5 ట్రోపీని గెలుచుకుంది. తెలుగు వారియర్స్ – చెన్నై రైనోస్ కి మధ్య జరిగిన ఫైనల్స్ లో తెలుగు వారియర్స్ విజేతగా నిలిచి సిసిఎల్ 5 విన్నర్ గా నిలిచింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్ టీం మొదటి నుంచి చెన్నై రైనోస్ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేస్తూ, టఫ్ బౌలింగ్ తో వరుసగా వికెట్లు తీస్తూ ఎక్కువ పరుగులు చేయనీకుండా చేసింది. చెన్నై రైనోస్ టీం ఓవరాల్ గా 20 ఓవర్లలో 132 పరుగులు చేసి 133 పరుగుల లక్ష్యాన్ని తెలుగు వారియర్స్ ముందు ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన తెలుగు వారియర్స్ టీం మొదటి నుంచి స్టాండర్డ్ గా ఆడుతూ పరుగుల వరదని ముందుకు సాగించారు. చెన్నై రైనోస్ ఇచ్చిన స్కోర్ ని 18.1 ఓవర్లలోనే పూర్తి చేసి తెలుగు వారియర్స్ విజయకేతనం ఎగురవేశారు. అంతే కాకుండా ఈ 5 సీజన్స్ లో మొదటి సారి తెలుగు వారియర్స్ సిసిఎల్ ట్రోపీని గెలుచుకుంది.

ఉప్పల్ లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ కి విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున, శ్రీ కాంత్, కాజల్ అగర్వాల్, మధురిమ, లక్ష్మీ రాయ్ లతో పాటు పలువురు హీరోయిన్స్ హాజరయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు