చరణ్ కొత్తగా ఓవర్సీస్ మీద దృష్టి పెట్టడానికి కారణం !

ram-charan-in
మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తన తరువాతి సినిమా ‘ధృవ’ విషయంలో ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన మేకోవర్ దగ్గర్నుంచి ప్రమోషన్ల వరకూ అన్నింటి మీదా దృష్టి పెట్టాడు. ముఖ్యంగా ఓవర్సీస్ పబ్లిసిటీ విషయంలో మరీ ఎక్కువ శ్రద్ద చూపుతున్నాడు. ఎప్పుడూ లేనిది చరణ్ ఇలా ఓవర్సీస్ మీద దృష్టి పెట్టడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అవేమిటంటే చరణ్ ఇప్పటి వరకూ టాలీవుడ్ పరిశ్రమ వరకూ పలు పెద్ద పెద్ద రికార్డులను క్రియేట్ చేశాడు. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఒక ‘మగధీర’ మినహా చరణ్ సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా అక్కడ అంతంత మాత్రంగానే ఉండేవి. చిన్న, మీడియం తరహా హీరోలు కూడా మిలియన్ మార్క్ ను ఈజీగా క్రాస్ చేసేస్తుంటే చరణ్ ఇప్పటికీ ఆ రికార్డును అందుకోలేదు. పైగా ఈ మధ్య లోకల్ లో సాదించే విజయం మీద ముందుగా విదేశాల్లో ప్రదర్శింపబడే ప్రీమియర్ షో టాక్ ప్రభావం కూడా ఉంటోంది. అలాగే ఇప్పటి నుండి ప్రయత్నిస్తే గాని భవిష్యత్తులో మంచి ఫలితాలు రాబట్టలేరు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చరణ్ ఇప్పుడిప్పుడే ఓవర్సీస్ మార్కెట్, పబ్లిసిటీ మీద దృష్టి సారిస్తున్నాడు.

 

Like us on Facebook