దర్శకుడిగా మారుతున్న మరోక సినిమాటోగ్రఫర్ !
Published on Jan 2, 2018 8:58 am IST

సినిమాటోగ్రఫర్లు దర్శకులుగా మారడం తెలుగు పరిశ్రమలో కొత్తేమీ కాదు. ఇప్పటికే కొంతమంది సినిమాలను కూడా ప్రారంభించగా ఇప్పుడు మరొక కెమెరామ్యాన్ మెగా ఫోన్ పట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆయనే నిజార్ షఫీ. ‘మహానుభావుడు, భలే భలే మగాడివోయ్’ వంటి హిట్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన నిజార్ షఫీ ద్విభాషా చిత్రానికి దర్సకత్వం వహించనున్నారు.

అది కూడా బనాలుగురు హీరోయిన్లతో కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో అంజలి, అనీషా ఆంబ్రోస్, శ్రద్ధ శ్రీనాథ్, నందిత శ్వేతలు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రం త్వరలోనే మొదలుకానుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.

 
Like us on Facebook