ఆ సినిమా యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది

ఆ సినిమా యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది

Published on Mar 16, 2018 10:24 AM IST

శ్రీ విష్ణు క‌థానాయ‌కుడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ఈరోజు ఉదయం ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది. 2 నిమిషాల 20 సెకెన్స్ ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చదువు అంటే ఇష్టం లేని అబ్బాయి, అలాంటి అబ్బాయి తండ్రి ఒక అధ్యాపకుడు అయితే ఎలా ఉంటుందో ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. తండ్రి, కొడుకు మధ్య సన్నివేశాలు దర్శకుడు బాగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ట్రైలర్ యూత్ ఫుల్ గా ఉంది. యువతకు బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ను తన మొదటి సినిమాకు కథ వస్తువుగా ఎంచుకోవడంలో సగం సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు ఉడుగుల. సంగీతం బాగుంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి బొంతల కొత్త ఎడిటర్ అయినా అనుభవం గల ఎడిటర్ గా ట్రైలర్ ను ఆసక్తికరంగా కట్ చెయ్యడం జరిగింది. ఈ నెల నీది నాది ఒకే కథ సినిమా థియేటర్స్ లో సందడి చేయ్యనుంది.

ట్రైలర్ కోసం క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు