‘యుద్ధం శరణం’ టీజర్ విడుదల !

‘యుద్ధం శరణం’ టీజర్ విడుదల !

Published on Jul 27, 2017 1:12 PM IST


అక్కినేని నాగ చైతన్య తను నటిస్తున్న తాజా చిత్రం ‘యుద్ధం శరణం’ గురించి ఒక సప్రైజింగ్ వార్తను ఈరోజు ప్రకటిస్తానన్న సంగతి తెలిసిందే. అన్నట్టుగానే ఆయన ఆ ప్రకటన చేశారు. అందులో చిత్ర టీజర్ ఈ నెల 31వ తేదీన విడుదలవుతుందని తెలిపారు. చైతన్య గత సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మంచి హిట్టై ఫ్యామిలీ ఆడియన్సుకు సైతం దగ్గరవడంతో ‘యుద్ధం శరణం’ పై మంచి క్రేజ్ ఏర్పడింది.

తమిళ దర్శకుడు కృష్ణ ఆర్వి మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటుడు శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పెళ్లి చూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు