సమీక్ష : 3జి లవ్ – సి క్లాస్ కి నచ్చే ఎ రేటింగ్ మూవీ

సమీక్ష : 3జి లవ్ – సి క్లాస్ కి నచ్చే ఎ రేటింగ్ మూవీ

Published on Mar 15, 2013 11:01 AM IST
3g-love-posters-(2) విడుదల తేదీ : 15 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : గోవర్ధన కృష్ణ
నిర్మాత : ప్రతాప్ కొలగట్ల
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : సిద్దార్థ్, తదితరులు …


‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ సినిమాల తరహాలో యూత్ ఫుల్ డ్రామాగా తెరకెక్కించిన సినిమా ‘3జి లవ్’. ఈ సినిమాని గొవర్ధన్ కృష్ణ దర్శకత్వం వహించగా ప్రతాప్ కొలగట్ల నిర్మాత. శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఈ సినిమాఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ :

నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కథ అనేదే లేదు.ఉందంటే ఒక అంశం కావచ్చు లేకపోతే కొన్ని చిన్న చిన్న అంశాలు కావచ్చు. మొదటి అంశం మాత్రం ఏ విధమైన సందేహం లేకుండా ఈ మధ్య వస్తున్న కమర్షియల్ ‘ఏ’ రేటెడ్ ‘ఈ రోజుల్లో’ లాంటి యూత్ కామెడీ సినిమా ఒకదాన్ని చుట్టేసి మన మీదకు వదిలేయడమే. దానికి వాడిన ముడి సరుకులు – ఇంజనీరింగ్ బ్యాక్ డ్రాప్, సెక్స్ కోసం తపించిపోతున్న కుర్రాళ్ళు, అనేక మంది బాయ్ ఫ్రెండ్స్ ని మైంటైన్ చేస్తున్న అమ్మాయిలు, అందరికీ మంచి చెప్పే రావు రమేష్.

రెండో ఎజెండా ఎంటంటే మేము గొప్ప అంటే మేము గొప్ప అనే అమ్మాయిలు, అబ్బాయిల మధ్య తగాదాలు. ‘మిస్ ఎప్పటికైనా మిసెస్ అవ్వాల్సిందేనే… కానీ మెన్ ఎప్పుడూ మిస్టర్స్ ఏ’, ‘అబ్బాయిలు ఎప్పుడూ తమ కన్యత్వాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడతారు, కానీ అమ్మాయిలు అలా ఇష్టపడరు’ అనే డైలాగ్స్ తో డైరెక్టర్ మనకి ఎం చెప్పాలనుకుంటున్నాడో క్లియర్ గా అర్థమవుతుంది.

ఒక ప్లాట్ అనేది లేకుండా, ముఖ్యమైన రొమాంటిక్ ట్రాక్ అనేది లేకుండా, కుంటుకుంటూ పాక్కుంటూ అక్కడక్కడా కొన్ని చీప్ జోక్స్ తో రెచ్చగొట్టే డైలాగులతో మధ్య మధ్యలో రావు రమేష్ నీతి బోధనలతో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుంది. చివరికి ఏమవుతుందా అనే చిన్న ఆసక్తే ఈ సినిమా మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

శేఖర్ చంద్ర అందించిన సంగీతమే ఈ సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్. అక్కడక్కడా ఒకటి రెండు మసాలా సీన్లు మెప్పిస్తాయి. కాకపోతే అవి ఎక్కడ ఉన్నాయో వెతకడం చాలా కష్టం. సినిమాలో చాలా మంది యాక్టర్లు ఉండటంతో ఎవరెవరు ఏ ఏ పాత్ర చేసారో గుర్తుంచుకోవడం కాస్త కష్టం. కొంతమంది మాత్రమే పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో ఇంత దారుణమైన కధని ఏ డిపార్టుమెంటు వాళ్ళూ అందించి ఉండరు. క్యారెక్టర్ డెవలెప్ మెంట్ అనేది భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా మనకు కనబడదు. కొంతమంది నటులు అతి దారుణమైన నటనతో మన సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా ఆ ఆడిటోరియుం ఎపిసోడ్, బబుల్ గమ్ లా సాగుతూనే ఉంది.

సినిమా క్లైమాక్స్ కి వచ్చేసరికి సాదాసీదాగా మారిపోద్ది. ఈ సినిమాలో ప్రధానమైన వాదన ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలని కేవలం సెక్స్ కోసమే ప్రేమిస్తారని. ‘మన్మధుడు’ సినిమాలో నాగార్జున పాత్ర తరహాలో లేడీస్ హాస్టల్ లో ఒక అమ్మాయి క్యారెక్టర్ ని పెట్టి మనల్ని చిత్రహింసలు పెట్టాడు. ఆమెకు తెలిసిన ఏకైక సూత్రం అబ్బాయిలని ద్వేషించడం. ఆమె నటన, డైలాగ్లు మనల్ని జుట్టు పీక్కునేలా చేస్తున్నాయి.
ఈ సినిమా నిడివి కాస్త ఎక్కువ. ఓ 30 నిముషాలు ఎడాపెడా కత్తిరించేసినా ఏమి తేడా ఉండకపోవచ్చు. పార్క్ లో ఒక కుర్రాడు ప్రేమికుల జంటని తన గర్ల్ ఫ్రెండ్ తో ఎలా ఎంజాయ్ చెయ్యలా అని అడిగే సన్నివేశంలో చెప్పిన డైలాగ్ “భయ్యా, మీరు ఈ పొజిషన్ కి రాక ముందు ఎం చేస్తే ఇలా వచ్చారో చెప్పరా? ” చాలా భాదకలిగించే సంభాషణ.
ఆఖరిగా రావు రమేష్. మంచి పాత్రని ఇవ్వకుండా అతన్ని బుక్ చేసుకొని అతను ఈ సినిమాలో బుక్కయిపోయేలా చేసాడు. అతని నటన సహజంగా కుడా కనబడదు. అతని టాలెంట్ ని నిజంగా వృధా చేసుకున్నారు

సాంకేతిక విభాగం:

మళ్లీ ఇక్కడ మాట్లడుకోవలిసింది కేవలం శేఖర్ చంద్ర గురించే. అతని గురించి మళ్ళీ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగ్స్ అస్సల బాలేవు. తెలివిగా రాస్తేనే అడల్ట్ జోక్స్ పెల్తాయి. సినిమాటోగ్రఫీ అంత బాలేదు. ఎడిటింగ్ అన్న అంశమే మనకు కనబడదు.గోవర్ధన్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే విధానాలు ఉండాల్సినంత స్థాయిలో లేవు. వీటి గురించి ఇక్కడతో వదిలేయడం ఉత్తమం.

తీర్పు:

ఈ సినిమా తెలివైన ప్రేక్షకులకి ఒక కటినమైన శిక్ష. రచన, నటన బాగోకపోగా.. క్యారెక్టర్ ప్లాట్ అనేది అస్సల లేదు. ఈ సినిమా ఎక్కువ కాలం ఆడుతుంది అనుకోవడం మన అమాయకత్వం. సినిమాలో ఉన్న అసభ్యమైన సన్నివేశాల వల్ల కేవలం సీ సెంటర్లలో కొంత డబ్బులు రాబట్టుకోవచ్చు. కానీ ఇవేవి ‘3జి లవ్’ సినిమా దారుణంగా ఉంది అనే నిజాన్ని మార్చలేవు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

అనువాదం:వంశీ

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు