సమీక్ష 2 : బిజినెస్ మాన్

సమీక్ష 2 : బిజినెస్ మాన్

Published on Jan 14, 2012 2:48 PM IST
విడుదల తేది :13 జనవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.5/5
దర్శకుడు : పూరి జగన్నాధ్
నిర్మాత : వెంకట్
సంగిత డైరెక్టర్ : తమన్ .ఎస్
తారాగణం : మహేష్ బాబు , కాజల్ , నాజర్ ,ప్రకాష్ రాజ్

ఈ ప్రపంచం కురుక్షేత్రం లాంటిది పోరాట పటిమ ఉంటే తప్ప నువ్వు గెలవలేవు” అని సూర్య భాయి చెప్పారు. బిజినెస్ మాన్ లో సూర్య భాయి అంటే మహేష్ బాబు పాత్ర. పూరి జగన్నాథ్ శైలి డైలాగు తో సినిమా ఆసాంతం అలరించారు. ఇదే ఈ చిత్ర విజయానికి దోహదపడుతుంది.

కథ :
ముంబై లో ఇంకా మాఫియా లేదు అని పోలీసు తేల్చి చెప్పే సమయం లో మహేష్ బాబు తన ఫ్రండ్ ని కలవటానికి ముంబై చేరుకుంటారు. చూడటానికి శాంతంగా కనిపించే ఈ పాత్ర ముంబై కి ఎందుకోచ్చాడో తన స్నేహితుడు కి చెపుతాడు మారిపోయిన మాఫియా వాళ్ళను తన బృందం లో చేర్చుకొని జనం కి మంచి చేసే పనులు చేస్తూ “సూర్య భాయి” గ మారిపోతాడు. తన పేరు ఢిల్లీ వరకు వెళ్తుంది తన రక్షణ కోసం కమిషనర్ కూతురయిన కాజల్ ని ప్రేమిస్తాడు. కాని మెల్లగా తను నిజంగా ప్రేమించడం మొదలు పెడతాడు కాని తనని కవచం లో వాడుకోమని ఒత్తిడి వస్తుంది. అసలు సూర్య ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? అనేది మిగిలిన కథ

ప్లస్:

ఈ చిత్రం లో ప్లస్ గురించి చెప్పాలంటే ఇద్దరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. మొదటగా మహేష్ బాబు నటన ఈ చిత్రం లో మహేష్ బాబు అద్బుతంగా నటించారు. తన నటన జనం కి చేరువయ్యేలా వుంది. మరొకరి గురించి చెపాలంటే పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుకోవాలి నటుడిగా కాదు దర్శకుడిగా అయన టేకింగ్ అయితే అద్బుతం కథను నడిపించిన విధానం కథనం లో కొత్తదనం ఇలా అన్ని అంశాలలో ఈయన విజయం సాదించారు.నాజర్ పాత్ర ఏదో కనిపించింది అనిపిన్చిన్దిహ్ ప్రకాశ్ రాజ్ మాములుగానే బాగా చేసారు కాని చిన్న పాత్రకే పరిమితమయ్యారు,షాయాజీ షిండే , సుబ్బ రాజు , రాజా మురాద్ , ధర్మవరపు సుబ్రహ్మణ్యం , బ్రహ్మాజీ మొదలగు వారు మహేష్ బాబు పాత్రకు మంచి సహాయం అందించారు.

మైనస్:

ఈ చిత్రం లో మహేష్ బాబు పాత్ర అద్బుతంగా ఉన్నపటికీ ఆ పాత్రకు కనీస విలువలు లేకుండా చిత్రీకరించడం కొన్ని వర్గాల వారికీ ఇబ్బంది కలిగించాచు. చిత్రం లో బూతులు వాడటం వాళ్ళ కొన్ని వర్గాల ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. పతాక సన్నివేశాల కి వచ్చేపుడు సన్నివేశాలను త్వరగా ముగించేసారు. కాస్త సున్నితమయిన మనస్కులు కథను ఇంకోలా అర్ధం చేసుకుంటారు.

టెక్నికల్ విభాగం:

పూరి జగన్నాథ్ రచించిన మాటలు బాగుండటమే కాకుండా జీవిత సత్యాన్ని తెలిపేలా వున్నాయి. కథనం విషయానికొస్తే నడిపించిన తీరు అద్బుతం చాలా వేగంగా నడిపించారు. తమన్ అందించిన నేఫధ్య సంగీతం చిత్రానికి బలం అందించింది. ఎడిటింగ్ మరియు ఛాయాగ్రహణం విభాగం వారి పని వారు చేసారు ఎడిటింగ్ ఇంకాస్త బాగుంటే బాగుండేది.పాటలు కాస్త బోర్ కొట్టించాయి. కాజల్ మహేహ్స్ బాబు ల జంట చూడటానికి బాగుంది.

చివరి మాట :

బిజినెస్ మాన్ తన జనం కోసం ఎటువంటి పని అయిన చేసే ఒక యువకుని కథ చూసినంతసేపు ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.

అనువాదం – రv

123తెలుగు.కాం రేటింగ్: 3.5/5

Click For English Review2

సంబంధిత సమాచారం

తాజా వార్తలు