బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ సినిమా ‘డాన్ 3’ నుండి హీరో రణ్‌వీర్ సింగ్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో, ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ ఆయనపై నిషేధం విధించింది. షూటింగ్ ముందే సినిమా వదిలేసినందుకు వివరణ ఇవ్వాలని మూడుసార్లు నోటీసులు ఇచ్చినా రణ్‌వీర్ స్పందించలేదు.
దీంతో ఫెడరేషన్‌కు చెందిన దర్శకులు, కెమెరామెన్లు, లైట్‌మెన్, స్పాట్‌బాయ్స్ ఎవరూ ఆయన సినిమాలకు పని చేయకూడదని ఫెడరేషన్ నిర్ణయించింది. అయితే, ఈ నిషేధం వల్ల రణ్‌వీర్ కెరీర్‌కు వచ్చే నష్టమేమీ లేదు. ఇటీవలే ‘ధురంధర్’ సినిమాతో రూ.1000 కోట్ల భారీ హిట్ కొట్టిన రణ్‌వీర్ ప్రస్తుతం మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్. కాబట్టి పెద్ద నిర్మాణ సంస్థలు ఈ ఆదేశాలను పట్టించుకునే ఛాన్స్ లేదు.
ఇలాంటి వాటికంటే టికెట్ ధరలు, కార్మికుల జీతాలు, ఏఐ ముప్పు వంటి ముఖ్యమైన సమస్యలపై ఫెడరేషన్ దృష్టి పెడితే బాగుంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.


