సమీక్ష : గబ్బర్ సింగ్ – పవన్ కళ్యాణ్ సాలిడ్ ఎంటర్ టైనర్

సమీక్ష : గబ్బర్ సింగ్ – పవన్ కళ్యాణ్ సాలిడ్ ఎంటర్ టైనర్

Published on May 11, 2012 1:07 AM IST
విడుదల తేది : 11 మే 2012
దర్శకుడు : హరీష్ శంకర్
నిర్మాతలు : బండ్ల గణేష్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
తారాగణం : పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ , మలైకా అరోరా , అభిమన్యు సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యంత వేచి చూస్తున్న చిత్రం “గబ్బర్ సింగ్” రేపు భారీ అంచనాల మధ్య విడుదల అవుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శృతి హాసన్ కథానాయికగా నటించింది. ఈరోజు ఇక్కడ ప్రదర్శించిన ప్రత్యేక ప్రదర్శనలో మేము పాల్గొన్నాము ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

కథ :

వెంకట రత్నం నాయుడు (పవన్ కళ్యాణ్) సుహాసిని కొడుకు. సుహాసిని నాగినీడు ని రెండవ పెళ్లి చేసుకుంటుంది. వెంకట రత్నం నాయుడు “షోలే” చిత్రం నుండి గబ్బర్ సింగ్ పాత్రను చాలా ఇష్టపడతాడు తనని తాను “గబ్బర్ సింగ్” అని పిలవాలని నిర్ణయించుకుంటాడు. అతను పెరిగి పెద్దయ్యి డేరింగ్ అండ్ డాషింగ్ పోలిస్ అవుతాడు. తన సొంతూరయిన కొండవీడులోనే పోలిస్ గా నియమితమవుతాడు. న్యాయన్ని కాపాడే విధానంలో అతనికి సిద్దప్ప నాయుడు (అభిమన్యు సింగ్)తో గొడవ మొదలవుతుంది. సిద్దప్ప నాయుడు రాజకీయ పలుకుబడి ఉన్న ప్రాంతీయ గూండా.

సిద్దప్ప నాయుడుతో గొడవలతో పాటు భాగ్య లక్ష్మి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు గబ్బర్ సింగ్. పరిస్థితులు ఇలా సాగుతుండగా చిత్రంలో ఈర్ష్య,ద్వేషం అనే భావాలూ ప్రవేశిస్తాయి. సిద్దప్ప చేసే చట్ట వ్యతిరేకమయిన పనులను గబ్బర్ సింగ్ ఆపగలిగాడా? తను అనుకున్నది సాదించడానికి గబ్బర్ సింగ్ ఏం కోల్పోవాల్సి వచ్చింది అనేది మిగిలిన కథ

“దబాంగ్” చిత్రం ఎలా ఉందో అలా తీసేయలేదు చిత్ర కథలో పెద్ద పెద్ద మార్పులు చేశారు. పాత్రలు ప్రవర్తించే విధానంలో కూడా చాలా మార్పులు చేశారు

ప్లస్:

పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” పాత్రలో అద్బుతంగా కనిపించారు చిత్రంలో అయన ప్రదర్శన ప్రత్యేకార్షణ కానుంది. అయన పండించిన కామెడి అభిమానులకి పండగ. ఎప్పటిలానే యాక్షన్ సన్నివేశాలలో అలరించిన ఈయన ఈసారి డాన్స్ లు కూడా ఇరగదీసారు. సాధారణ పల్లెటూరి అమ్మాయిల శృతి హాసన్ చాలా అందంగా కనిపించారు. చిత్రంలో ఈ పాత్ర కనిపించినంతవరకు తన పాత్రకు న్యాయం చేశారు. కానిస్టేబుల్ సాంబ పాత్రలో అలీ మరియు పవన్ మధ్య సన్నివేశాలు చాలా బాగున్నాయి. రికవరీ రంజిత్ పాత్రలో బ్రహ్మానందం తనదయిన శైలిలో హాస్యాన్ని పండించారు. సుహాసిని మరియు నాగినీడు వారి పాత్రల మేరకు బాగానే చేశారు.

అభిమన్యు సింగ్ సిద్దప్ప నాయుడు పాత్రలో పరవలేధనిపించగా. చిన్న పాత్రే అయినా రావు రమేష్ చాలా బాగా చేశారు. ‘హ్యాపీ డేస్’ ఫేం గాయత్రి ముందు బెంచ్ లను ఆకట్టుకునేలా మంచి పాత్ర చేసింది. చిత్రంలో మొదటి అర్ధ భాగం చాలా వేగంగా నడుస్తుంది. మొదటి అర్ధ భాగంలో వచ్చే డైలాగ్ లు ప్రేక్షకులను అలరించాయి. పవన్ రిక్షా లో చిరంజీవి “ఈ పేటకు నేనే మేస్త్రి” పాటతో వచ్చే సన్నివేశం అభిమానుల మనసుని గెలుచుకోనుంది. చిత్రం మొత్తం హాస్యం బాగానే ఉండేలా చూసుకున్నారు. పోలిస్ స్టేషన్ లో అంత్యాక్షరి సన్నివేశం నవ్వులు పండించింది. పవన్ మరియు శృతి మధ్యలో ప్రేమ సన్నివేశాలు అలరించేలా చిత్రీకరించడంలో హరీష్ శంకర్ విజయం సాదించారు.

మైనస్:

అజయ్ పాత్ర చిన్నదిగా ఉండటం పెద్దగా చెయ్యటానికి ఏమి లేకపోవటం కోట శ్రీనివాస రావు పాత్ర కూడా చిన్నది అనిపిస్తుంది. ‘మందు బాబులం’ పాట మినహా చిత్రంలో కోట శ్రీనివాస రావు పాత్ర పెద్దగా అనిపించదు. రెండవ అర్ధ భాగంలో కథలో చాలా మార్పులు చేశారు మాతృకలోని సన్నివేశాలే వాడుంటే బాగుండేది. తనికెళ్ళ భరణి తనకు తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. రెండవ అర్ధ బాగం కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో కాస్త శ్రద్ద తీసుకొని ఉంటె బాగుండేది. కథ క్లైమాక్స్ కి దారి తీస్తున్నపటి సమయానికి చిత్రంలో ఏదో వెలతి కనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకాస్త బాగా తీసుండాల్సింది. శృతి హాసన్ కి డబ్బింగ్ సరిపోలేదనిపిస్తుంది.

సాంకేతిక అంశాలు :

చిత్రానికి అందించిన చాయాగ్రహణం అద్బుతం ప్రదేశాలను మరింత అందంగా చూపించారు. ఐరోపాలో చిత్రీకరించిన పాటలు చాలా బాగా వచ్చాయి డి.ఐ చాలా బాగుంది ఎడిటింగ్ బానే ఉంది. ఫైట్స్ చాలా బాగా చిత్రీకరించారు. దేవి శ్రీ అందించిన నేఫధ్య సంగీతం చిత్ర ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. హరీష్ శంకర్ రచించిన సంభాషణలు పవన్ కళ్యాణ్ నోట వింటుంటే అద్బుతం అనిపించేలా ఉన్నాయి. హరీష్ మొదటి అర్ధ భాగంలో విజయం సాదించినా రెండవ అర్ధ భాగం అదే మాయాజాలం చెయ్యటంలో విఫలం అయ్యారు.

తీర్పు :

పవన్ కళ్యాణ్ అభిమానులకి పండగ వంటి చిత్రం చిత్రంలో మంచి మోతాదులో హాస్యం ఉంది అద్బుతమయిన సంభాషణలు పవన్ కళ్యాణ్ నుండి అలరించే ప్రదర్శన. రెండవ అర్హ భాగం కాస్త వేగంగా ఉండి ఉంటె మరింత బాగుండేది. మొదటి అర్ధ భాగం పవన్ కళ్యాణ్ ప్రదర్శన ఈ చిత్రాన్ని నిలబెట్టాయి.

రేటింగ్:

ఈ చిత్రానికి అధికారిక మీడియా పార్ట్నర్స్ మేమే కావటం మూలాన ఈ చిత్రానికి రేటింగ్ ఇవ్వటం సమంజసం కాదు కావున ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వదలుచుకోవట్లేదు రివ్యూ చదివి చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం

అనువాదం : రv

Clicke Here For ‘ Gabbar Singh’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు