‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌కు సర్జరీ.. కారణం ఏమిటంటే..?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌కు సర్జరీ.. కారణం ఏమిటంటే..?

Published on May 30, 2026 3:54 PM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్రను పోషించాడు. షూటింగ్ సమయంలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన ఎంతో ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ చేసి, పలుమార్లు గాయపడ్డాడు. అయినప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఎటువంటి కంప్లెయింట్స్ చేయకుండా నిరంతరం శ్రమించిన చరణ్ పట్టుదలను చిత్ర బృందం మొత్తం ఎంతగానో ప్రశంసించింది.

ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ చేతికి రిస్ట్ బ్యాండ్‌తో కనిపించగా, దీనిపై ఆయన స్వయంగా స్పందించాడు. ‘పెద్ది’ షూటింగ్ చివరి రోజుల్లో ఒక యాక్షన్ స్టంట్ చేస్తున్నప్పుడు తన చేతికి గాయమైందని చరణ్ తెలిపాడు. చేతి కండరం దెబ్బతినడంతో ఆయనకు సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. అయితే, సినిమా ప్రమోషన్స్ ఎంతో ముఖ్యం కావడంతో చరణ్ తన శస్త్రచికిత్సను వాయిదా వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన పూర్తి శ్రద్ధ అంతా సినిమా ప్రమోషన్స్ పైనే ఉంది.

ఇక పెద్ది సినిమా విడుదలైన వెంటనే రామ్ చరణ్ ఈ సర్జరీ చేయించుకోనున్నాడు. ఆ తర్వాత కోలుకోవడానికి ఆయనకు తగినంత సమయం దొరకనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు