సమీక్ష : మాలిని & కో – ఓ వృధా ప్రయత్నం.

సమీక్ష : మాలిని & కో – ఓ వృధా ప్రయత్నం.

Published on Aug 29, 2015 6:00 PM IST
Malini and Co  review

విడుదల తేదీ : 28 ఆగష్టు 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం :  వీరు.కె 

నిర్మాత : మహేష్ రాఠీ 

సంగీతం : వీరు.కె 

నటీనటులు : పూనమ్ పాండే, సుమన్, సామ్రాట్, రవికాలే…

మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తన హాట్ హాట్ పోజులతో ఇండియా మొత్తం టాక్ అఫ్ ది టౌన్ గా మారిన పూనమ్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ ‘మాలిని & కో’. మహేష్ రాఠీ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం, దర్శకత్వ్ బాధ్యతలను వీరు.కె డీల్ చేసాడు. పూనమ్ పాండే తో పాటు సుమన్, సామ్రాట్, రవికాలే, మిన్ లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ హాట్ బ్యూటీ నటించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

మాలిని(పూనమ్ పాండే) ముంబైలో ఒక మసాజ్ పార్లర్ రన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే సమయంలో శ్రీ లంకకి సంబందించిన కొంతమంది మిలిటెంట్స్ ముంబైలో నివసిస్తున్న కొంతమంది తమిళియన్స్ పై దాడి చెయ్యడానికి ఓ బిగ్గెస్ట్ బాంబ్ బ్లాస్ట్ ని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చెయ్యడానికి ఒక టీంని ముంబైలో దించుతారు. అక్కడికి వచ్చిన వారు మాలిని మసాజ్ పార్లల్ నడపడం చూసి అందరూ షాక్ అవుతారు. ఇంతకీ ఈ మాలిని ఎవరు.? మాలిని గతం ఏంటి.? ఈ టెర్రరిస్ట్ అటాక్స్ కి మాలినికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

మాలిని & కో అనే సినిమాకి వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ ప్లస్ పూనమ్ పాండే అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పెర్ఫార్మన్స్ పరంగా మీరు పెట్టిన మనీకి న్యాయం చెయ్యకపోయినా తన గ్లామరస్ లుక్, అందాల ఆరబోతతో మాత్రం మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. విలక్షణ నటుడు సుమన్ తనకి ఇచ్చిన డాన్ పాత్రలో డీసెంట్ నటనని కనబరిచాడు.

ఈ సినిమాలో చూపించిన విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. అలాగే శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఆర్మీ గ్రూప్స్ ని చూపించిన విధానం చాలా బాగుంది. జీవ, రోహిత్ రెడ్డి, సామ్రాట్ మరియు కొంతమంది నటీనటులు తమ పాత్రలకి న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది.. మాలిని & కో సినిమా మీలోని సహనానికి పెట్టె పెద్ద పరీక్ష. సినిమా మొదటి నుంచి స్లోగా ఉండడమే కాకుండా సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ కథనంతో ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెడతాడు. అలాగే ప్రతి 10 నిమిషాలకి పూనమ్ ఉంది కదా అని ఓ పాట పెట్టేసి అందాలను చూపించడం కొద్ది సేపటి తర్వాత చిరాకు తెప్పిస్తుంది. కొన్ని పాటలైతే సి గ్రేడ్ సినిమాల్లో వచ్చే పాటల్లా ఉండడం చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. పూనమ్ పాండే లాంటి హీరోయిన్ ఉన్నప్పుడు నిర్మాతలు ఎందుకు ఇలాంటి కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఎంచుకున్నారో వారికే తెలియాలి. నా ఉద్దేశం ప్రకారం యాక్షన్, టెర్రరిజం ల్కాంటి బ్యాక్ డ్రాప్ కాకుండా రొమాంటిక్ థ్రిల్లర్ టైపు సినిమాని ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది.

సినిమాలో ఒక 20 నిమిషాల తర్వాత సినిమా అంతా నాన్సెన్స్ గా అనిపిస్తుంది. సీన్ కి సీన్ కి పెద్ద కనెక్షన్ ఉండదు. అలాగే సినిమాలో నటించిన చాలా మంది నటీనటులకు టాలెంట్ ఉన్నా తమ నటనతో ఇర్రిటేట్ చేసారు. అలాగే సినిమాలో చూపిన అందాల ఆరబోత సీన్స్ సినిమాలోని ఫ్లేవర్ ని పూర్తిగా చెడగోట్టేసాయి. ఇకమీదన్నా పూనమ్ పాండే హాట్ హాట్ ఫోటో షూట్స్ తీయడం మానేసి యాక్టింగ్ స్కూల్ లో చేరితే బెటర్.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శక, రచయిత వీరూ. కె దగ్గర్నుంచి మొదలుపెడదాం. ఒక మసాలా యాక్షన్ సినిమాకు సరిపడా కథను తీసుకున్నా దాన్ని సినిమాగా మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా తయారుచేయలేకపోయారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే బాగుంటే పర్వాలేదనిపించే తరహా సినిమాకు అక్కడే ఏమాత్రం ప్రతిభ చూపకపోతే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది. దర్శకుడిగా వీరూ పూనమ్ పాండే లాంటి క్రేజున్న స్టార్‌ను పెట్టుకొని కూడా సినిమాకు గ్లామర్ టచ్ కూడా ఇవ్వడంలో విఫలమయ్యాడు. సినిమాను ఎక్కడా గ్రిప్పింగ్‌గా నిలపలేకపోయాడు.

సినిమా మ్యూజిక్ కూడా బిలో యావరేజ్ అనే చెప్పాలి. పాటలేవీ ఆకట్టుకునేలా లేవు. అయితే ఉన్నంతలో నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయంలో రాజీ పడకపోవడంతో సినిమాకు మంచి లుక్ వచ్చింది. ఇక డైలాగ్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు.

తీర్పు :

పూనమ్ పాండే లాంటి నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న సెన్సేషనల్ మోడల్ తెలుగులో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మాలిని అండ్ కో’.. ఈ ఒక్క అంశాన్నే మేజర్ పాయింట్‌గా చూపిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్‌ అంటూ ఒకటి చెప్పుకోవాల్సి వస్తే అది పూనమ్ పాండే గ్లామరే! పర్వాలేదనుకునే కథతోనే మన ముందుకు వచ్చినా సరైన ప్రెజెంటేషన్ లేక ఈ సినిమా పరమ బోరింగ్‌గా తయారైంది. సినిమాలో పూనమ్ పాండే స్కిన్ షో తప్ప గ్రిప్పింగ్ పాయింట్ ఒక్కటీ లేదు. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే.. అర్థం పర్థం లేని స్క్రీన్‌ప్లేతో, అతీగతీ లేని సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా బీ, సీ సెంటర్లలో మాత్రం పరవాలేదనిపిస్తుందంతే!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు