లేటెస్ట్ గా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన రేస్ బ్యాక్ డ్రాప్ ఎమోషనల్ డ్రామా బైకర్ కూడా ఒకటి. దర్శకుడు అభిలాష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా పెద్ది, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన స్పందన షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది.
బైకర్ కోసం చాలా గొప్ప విషయాలు వింటున్నాను అని ఇలాంటి అరుదైన కాన్సెప్ట్ ని తెచ్చినందుకు యూవీ క్రియేషన్స్ వారికి హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. అంతే కాకుండా శర్వానంద్, రాజశేఖర్ ల పెర్ఫార్మన్స్ కి మంచి ఫీడ్ బ్యాక్ రావడం ఆనందంగా ఉందని అలాగే దర్శకుడు అభిలాష్ కృష్ణ ఇలాంటి యూనిక్ అటెంప్ట్ చేయడం గొప్ప విషయం అని తెలిపారు. దీనితో ఈ సినిమా యూనిట్ కి చరణ్ పోస్ట్ మరింత బూస్టింగ్ అందించింది అని చెప్పవచ్చు.
Hearing wonderful things about #Biker and so happy to see it doing so well ❤️
Hats off to @UV_Creations for backing a unique concept with such conviction and mounting it on a grand scale without compromise. Truly commendable.
Glad to see my dearest friend @ImSharwanand…
— Ram Charan (@AlwaysRamCharan) April 5, 2026


