ఆడియో సమీక్ష : నిప్పు – రవితేజ కమ్మర్షియల్ ఆల్బం

ఆడియో సమీక్ష : నిప్పు – రవితేజ కమ్మర్షియల్ ఆల్బం

Published on Jan 22, 2012 8:40 PM IST


మాస్ రాజ రవి తేజ అందాల తార దీక్ష సెత్ నటించిన చిత్రం “నిప్పు”. ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహించగా వై .వి.ఎస్.చౌదరి నిర్మించారు ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు.ఏడు పాటలున్న ఈ చిత్ర ఆల్బం ఆడియో ఈ మధ్యనే విడుదల అయ్యింది ఇప్పుడు పాటలు ఎలా ఉన్నాయో చుద్దాం.

1. పాట : వేగ వేగ
గాయకులూ : శంకర్ మహదేవన్
రచయిత : చంద్రబోస్

 

మంచి ఎనర్జీ ఉన్న పాట ఇది శంకర్ మహదేవన్ తన గాత్రం తో ఇంకాస్త ఎనర్జీ ని జోడించారు. చిత్రం లో హీరో ఇంట్రోడక్షన్ కి వచ్చే పాటలా ఉంది. తమన్ మామూలు పాటలానే ఉంది పేర్కుషన్ మరియు సిన్తసైసర్ వాయిద్యాలు భారీగా ఉపయోగించారు. మ్యూజిక్ పెప్పి గా బాగుంది. చంద్రబోస్ అందించిన సాహిత్యం పరవాలేదు.

2. పాట : నేనా నిన్ను
గాయకులూ : కార్తిక్,చిత్ర
రచయిత : వనమాలి

ఈ డ్యూయెట్ పాట చిత్రగారి గాత్రం తో అద్బుతంగా మొదలవుతుంది. కార్తిక్ మరియు చిత్ర లు ఈ పాటకి వారి గాత్రం తో ప్రాణం పోశారు చిత్ర గారు తన గాత్రంతో పాటని మరొక అంచు పైన ఉంచారు వనమాలి అందించిన సాహిత్యం బాగున్నా పాటలో కొత్త దనం ఏమి లేదు . వినడానికి పాట బాగుంటుంది అంతే.

3. పాట :ఆలీబాబా
గాయకులు : జావేద్ అలీ
రచయిత : విశ్వ

 

ఈ సోలో పాట స్నేహం గురించి పాడుకునే పాటలా ఉంది చిత్రం లో ప్రధాన పాత్రల మధ్యలో స్నేహాన్ని చూపించేందుకు ఈ పాట ని పెట్టుంటారు అని అనిపిస్తుంది జావేద్ అలీ గాత్రం పర్వాలేదు అనిపించగా విశ్వ సాహిత్యం అంత గొప్పగా లేదు. ఈ పాటలో కూడా సిన్తసైసర్ వాయిద్యాలు డామినేట్ చేస్తాయి.

4 . పాట : ఓయ్ పిల్ల
గాయకులు : టిప్పు,హరిణి
రచయిత : రామ జోగయ్య శాస్త్రి

ఆల్బం లో మాస్ మసాల పాట ఇది టిప్పు, హరిణి వారి గాత్రం తో ఈ పాటకి న్యాయం చేశారు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం పెద్దగా లేదు పాటలో డ్రం బీట్స్ మరియు సిన్తసైసర్ వాయిద్యాలు డామినేట్ చేస్తాయి గాయకుల గాత్రానికి తగ్గట్టు ప్రాంతీయ వాయిద్యాలతో బాగా సంగీతాన్ని అందించారు. తెర మీద అందంగా చూపిస్తే పాట ఇంకా బాగుంటుంది.

5 .పాట : డూబ డూబ
గాయకులు : తమన్
రచయిత : భాస్కర్ భట్ల

 

ఈ పాట కథానాయిక కోపంగా ఉన్నప్పుడు వెనకపడే సమయంలో వచ్చే పాటలా కనిపిస్తుంది. భాస్కర్ భట్ల సాహిత్యం పరవాలేదు మాములుగా ఇలాంటి పాటకి గాయకుడు గాత్రం లో పలు రకాల తేడాలు చూపించాలి కాని తమన్ ఇలాంటివి ఏం చుపించలేకపోయాడు మ్యూజిక్ కూడా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు.

6. పాట : దియా దియా
గాయకులు : రాహుల్ నంబియార్, శ్రీ కృష్ణ , కృష్ణ చైతన్య , దీపు,గీతా మాధురి మరియు కోరస్
రచయిత : అనంత శ్రీ రామ్

ఇది పెళ్లి పాట ల ఉంది పాట మొదటి నుండి ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఈ పాటను చాలా మంది గాయకులు పాడినప్పటికీ అందులో చెప్పుకోవలసినది ఏమి లేదు తమన్ మ్యూజిక్ లో భారీగా వాయిద్యాలు వాడటం వల్ల వీరి గాత్రం పెద్దగా వినిపించదు ఈ పాట గతం లో ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది.

7 .పాట : శ్లోకం
గాయకులు : శ్రావణ భార్గవి

 

మహా గణపతిం శ్లోకం ని శ్రావణ భార్గవి అద్బుతంగా పాడారు. ఏదయినా పూజ చేసే సందర్భం లో ఈ పాట వస్తుంది.

 

తీర్పు: చిత్రం లో పెద్దగా చెప్పెసుకోదగ్గ పాటలు ఏవి లేవు. రవితేజ కెరీర్ లో నిలిచిపోయే ఆల్బం కాదు కాని కొన్ని పాటలు మాత్ర్హం రవితేజ కి సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. కాని తమన్ ముందు విన పాటలే మళ్ళి కొట్టడం వల్ల ఆల్బం పెద్దగా అనిపించదు. వేగ వేగ మరియు నేనా నిన్ను పాటలు నా ఎంపిక.

అనువాదం: రv

Clicke Here For Nippu Audio Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు