సమీక్ష : ఓయ్ నిన్నే – అక్కడక్కడా బాగానే ఉంది

సమీక్ష : ఓయ్ నిన్నే – అక్కడక్కడా బాగానే ఉంది

Published on Oct 6, 2017 7:05 PM IST
Oye Ninne movie review

విడుదల తేదీ : అక్టోబర్ 6, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : సత్యం చల్లకొటి

నిర్మాత : సి.హెచ్. వంశి కృష్ణ శ్రీనివాస్

సంగీతం : శేఖర్ చంద్ర

నటీనటులు : భరత్ మార్గని, సృష్టి డాంగే

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఓయ్ నిన్నే చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న చిత్రంగా విడుదలైన ఓయ్ నిన్నే ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

స్టోరీ :

ఇది ఓ ప్రేమ జంట మధ్య సాగె కథ. విషు(భరత్), అమ్ములు(సృష్టి డాంగే ) లు చిన్ననాటి నుంచే స్నేహితులు. కలసి పెరిగిన వీరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. కానీ అమ్ములుకు మరొకరితో పెళ్లి నిశ్చయం అవుతుంది. వీరి ప్రేమ విడిపోవడానికి కారణం ఏంటి ? విషు ఏం చేశాడు ? ప్రేమ జంట తిరిగి కలుస్తారా ? లేక అమ్ములు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా ? అనే అంశాలతో కూడుకున్నదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్ర కథ పాతదే అయినా దర్శకుదు మలచిన విధానం మాత్రం బాగానే ఉంది. ప్రేమ జంట మధ్య తెరకెక్కించిన సరదా సన్నివేశాలు బావున్నాయి. ఇతర పాత్రల నుంచి దర్శకుడు మంచి పెర్ఫామెన్స్ ని రాబట్టాడు. కుటుంబ నేపథ్య సన్నివేశాలు, చిన్న టౌన్ లోని చిత్రీకరించిన సీన్స్ కథకు అనుగుణంగా ఉంటాయి.

ముఖ్యంగా నాగినీడు పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. అతడు మంచి నటనని కనబరిచారు. ఫస్ట్ హాఫ్ లో కమెడియన్ సత్య నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హాస్య భరితంగా ఉంటాయి. హీరోయిన్ సృష్టి లుక్స్ పరంగా బావుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె పరవాలేదనిపించే విధంగా నటించింది.

మైనస్ పాయింట్స్ :

మంచి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ని ఆసక్తికరంగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో పట్టుని వదిలేశాడు. హీరో హీరోయిన్లు తమ ప్రేమని తెలుసుకున్నాక కూడా సరైన ఎండ్ కి చిత్రాన్ని తీసుకురావడంలో దర్శకుడు తడబడ్డాడు. సిల్లీగా అనిపించే సన్నివేశాలు చిత్రంపై ఉన్న ఆసక్తిని తగ్గిస్తాయి.

ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. విలన్ పాత్ర కూడా చిత్రంలో ఓ మైనస్ పాయింట్ గా మిగిలిపోతుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగాలేవు. హీరో భరత్ కు తొలి చిత్రమే అయినా పరవాలేదనిపించే పెర్ఫామెన్స్ ని కనబరిచాడు.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. ప్రేమ నేపథ్యంలో సాగె సన్నివేశాల్ని పల్లెటూరి వాతావరణంలో కెమెరామెన్ బాగా చూపించారు. సంగీతం బావుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ వీక్ గా ఉంది. మరి కొన్ని నిమిషాల చిత్రాన్ని తగ్గించి ఉంటె బావుండేది.

రొటీన్ కథ అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ ని దర్శకుడు సత్యం మలచిన విధానం బావుంది. కానీ ద్వితీయార్థంలో అనేక కమర్షియల్ అంశాలని జతచేయడం వలన చిత్రం సాగదీతకు గురికాబడింది. ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ తో చిత్రాన్ని ముగించి ఉంటే ఫలితం ఇంకాస్త బెటర్ గా ఉండేది.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే.. ‘ఓయ్ నిన్నే’ అనే చిత్రం ఫస్ట్ హాఫ్ వరకు ఆకట్టుని ఆ తరువాత పూర్తిగా నిరాశకు గురిచేస్తుంది. లీడ్ పెయిర్ మధ్య బలమైన సన్నివేశాలు లేకపోవడం, సెకండ్ హాఫ్ లో కథని సాగదీయడం వలన చిత్రం బోర్ గా అనిపిస్తుంది. విలేజ్ నేపథ్యంలోని ప్రేమకథలు ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది. మిగిలిన వారిని ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువ.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు